AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా మన భూభాగాలను ఆక్రమించలేదు.. మోదీ

చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని, సరిహద్దులు కూడా దాటలేదని ప్రధాని మోదీ ప్రకటించారు.భారత భూభాగాన్ని వారు హస్తగతం చేసుకోలేదు.. అలాగే మన సైనికపోస్టును చేజిక్కించుకోలేదు అని స్పష్టం  చేశారు. ఏది ఏమైనా... లదాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద..

చైనా మన భూభాగాలను ఆక్రమించలేదు.. మోదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 20, 2020 | 10:49 AM

Share

చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని, సరిహద్దులు కూడా దాటలేదని ప్రధాని మోదీ ప్రకటించారు.భారత భూభాగాన్ని వారు హస్తగతం చేసుకోలేదు.. అలాగే మన సైనికపోస్టును చేజిక్కించుకోలేదు అని స్పష్టం  చేశారు. ఏది ఏమైనా… లదాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద చైనా జరిపిన దుశ్చర్యను దేశమంతా ఖండిస్తోందని, మన సైనికుల్లో  20 మంది అమరులయ్యారని, వారి త్యాగం వృధా కాదని ఆయన చెప్పారు. శుక్రవారం జరిగిన  అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన మోదీ.. ‘భరత్ మాతా’ పై కన్నెత్తి చూసినవారికి మన దళాలు గుణపాఠం నేర్పాయని  పేర్కొన్నారు.   భారత దేశాన్ని రక్షించుకోవడానికి మన సైన్యం అన్ని ప్రయత్నాలూ చేస్తుంది.. ఏ అవకాశాన్నీ వదులుకోదు.. మన భూభాగంలో కనీసం ఒక్క అంగుళం భూమినైనా వదులుకునేందుకు మనం సిధ్ధంగా లేము అని మోదీ ప్రకటించారు. భారత సైన్యానికి పూర్తి అధికారాలిచ్చా మని, మన దేశం శాంతినే కోరుతోందని చెప్పిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటామన్నారు.

నూతన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారణంగా ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వద్ద భారత గస్తీదళాల సామర్థ్యం పెరిగిందని మోదీ చెప్పారు. గాల్వన్ వ్యాలీలో గత సోమవారం చైనా సైనికుల దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. వీరిలో కొందరు గాల్వన్ నదిలో పడిపోయారు. మేకులు గుచ్చిన చెక్కలు, ఇనుప తీగెలతో కూడిన రాడ్లతో చైనా దళాలు దాడికి దిగాయి. ఇంత పాశవిక చర్యను భారత మిత్ర దేశాలన్నీ ఖండించాయి. కాగా ఈ దాడుల్లో చైనా సైనికులు  45 మంది గాయపడడమో , మృతి చెందడమో  జరిగిందని  భారత సైన్యం చెబుతుండగా .. తమ వాళ్ళు 30 మంది మరణించారని చైనా ప్రకటించింది.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల