Coronavirus Children Spread: పిల్లలపై కరోనా పెద్దగా ప్రభావం చూపించడం లేదని, ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి.. వారి ఆరోగ్యంపై కరోనా వైరస్ ప్రభావం పెద్దగా చూపించడం లేదని ఈ వైరస్ వచ్చిన తొలినాళ్లలో పలువురు వైద్య నిపుణులు వెల్లడించారు. అంతేకాదు వైరస్ సోకినప్పుడు కొందరు పిల్లల్లో లక్షణాలు తక్కువగా కనిపించాయని, మరికొందరిలో అసలు లక్షణాలు కనిపించలేదని, అతి తక్కువ మందికి మాత్రమే ‘కవసాకి’లా తీవ్ర ప్రభావం చూపిస్తోందంటూ తెలిపారు. ఇక పిల్లల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భరోసా ఇచ్చింది.
అయితే పిల్లలపై కరోనా పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా.. వారి నుంచి పెద్దలు, కుటుంబ సభ్యులకు వైరస్ సోకి మృత్యువాతపడుతున్నారని ది జర్మన్ సొసైటీ ఫర్ వైరాలజీ హెచ్చరించింది. ఈ విషయంలో ఇప్పటికైనా అప్రమత్తమవ్వాలని వారు చెబుతున్నారు. ఇక ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌ఓ పిల్లల విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం 12 ఏళ్లు, ఆపైన వయస్సున్న పిల్లలు కచ్చితంగా నోరు, ముక్కు కవరయ్యేలా మాస్కులు ధరించాలని సూచించింది. అలాగే ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు కూడా స్వచ్ఛందంగా మాస్కులు వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని, స్కూల్‌కి వెళ్లే పిల్లలు మాస్క్ ధరించాలని సూచించిన విషయం తెలిసిందే.
Read More: