Wild Elephants Attack: రహదారిపై ఏనుగుల గుంపు బీభత్సం.. చిన్నారి సహా ముగ్గురు మృతి.. కార్లు, వాహనాలు ధ్వంసం

అడవి నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఆగ్రహించిన ఏనుగులు రోడ్డుపై వెళ్తున్న ఆటోరిక్షాపై దాడి చేసి బోల్తా కొట్టించాయి. దీంతో ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులు

Wild Elephants Attack: రహదారిపై ఏనుగుల గుంపు బీభత్సం.. చిన్నారి సహా ముగ్గురు మృతి.. కార్లు, వాహనాలు ధ్వంసం
Elephants

Updated on: Dec 15, 2022 | 9:18 PM

అస్సాంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అస్సాం రాష్ట్రం గోల్‌పరా ప్రాంతంలో ఏనుగుల గుంపు రహదారులపైకి వచ్చి హల్‌చల్‌ చేసింది.. అడవిలో నుంచి వచ్చిన గజరాజుల గంపు రహదారిపై వెళ్తున్న ప్రయాణికులపైకి దూసుకొచ్చి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గోల్‌పరా ప్రాంతంలో గురువారం అటవీ ప్రాంతంలోని రహదారిపైకి వచ్చిన ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ద్రుబదత్త తెలిపారు. ఏనుగుల దాడిలో రెండు వాహనాలు సైతం పూర్తిగా ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవి నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఆగ్రహించిన ఏనుగులు రోడ్డుపై వెళ్తున్న ఆటోరిక్షాపై దాడి చేసి బోల్తా కొట్టించాయి. దీంతో ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అడవిలో పరిగెడుతూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఏనుగులు అక్కడితో ఆగలేదు. రోడ్డుపై వెళ్తున్న మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ను బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశాయి. అనంతరం స్థానికులు ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేశారు. అదే సమయంలో పోలీసులకు, అటవీశాఖకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి