CHIEF MINISTERS WAR: కేంద్రంపై ముఖ్యమంత్రుల యుద్ధం.. తెరమీదికి విజయన్, హేమంత్ సోరేన్

|

Jun 01, 2021 | 5:31 PM

కేంద్రంపై యుద్ధానికి బీజేపీయేతర ముఖ్యమంత్రులు రెడీ అవుతున్నారా? దీనికి కొందరు ముఖ్యమంత్రులు ఇనీషియేషన్ తీసుకుంటున్నారు. బీజేపీయేతర సీఎంలను కలుస్తానని చాన్నాళ్ళ క్రితం...

CHIEF MINISTERS WAR: కేంద్రంపై ముఖ్యమంత్రుల యుద్ధం.. తెరమీదికి విజయన్, హేమంత్ సోరేన్
Follow us on

CHIEF MINISTERS WAR AGAINST MODI GOVERNMENT: కేంద్రంపై యుద్ధానికి బీజేపీయేతర ముఖ్యమంత్రులు రెడీ అవుతున్నారా? దీనికి కొందరు ముఖ్యమంత్రులు (CHIEF MINISTERS) ఇనీషియేషన్ తీసుకుంటున్నారు. బీజేపీయేతర సీఎం (NON-BJP CHIEF MINISTERS)లను కలుస్తానని చాన్నాళ్ళ క్రితం తెలంగాణ (TELANGANA) ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రకటించినా.. ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభం కావడంతో ఆ ఆలోచనను వాయిదా వేసుకున్నారు. కానీ తాజాగా కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) మొదలైన క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో కొన్ని బీజేపీయేతర పాలక రాష్ట్రాలు యుద్దానికి సిద్దమవుతున్నాయి. దీనికి కేరళ (KERALA) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (PINARAI VIJAYAN) చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన దేశంలోని 11 మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

కేంద్ర ప్రభుత్వం కరోనా పాండమిక్ కాలం (CORONA PANDEMIC PERIOD)లో కొన్ని రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందన్నది పినరయి విజయన్ లేఖల సారాంశం. కరోనాను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ (VACCINE) పంపిణీ చేసేలా కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం.. అందరు కలిసి రావాలని విజయన్ బీజేపీ (BJP)యేతర ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కేంద్రం కొనుగోలు చేస్తే ఒకరేటు.. రాష్ట్రాలు అడిగితే మరో రేటు చెబుతున్నాయని.. ఈ నేపథ్యంలో ధరల మధ్య వ్యత్యాసాలు లేకుండా కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి.. రాష్ట్రాల సహకారంతో దేశప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని విజయన్ తన లేఖల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేచ్చేందుకు ముందుకు రావాలని కేరళ సీఎం.. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

ఇదిలా వుండగా.. ఝార్ఖండ్ (JHARKHAND) ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ (HEMANT SOREN) మరో అడుగు ముందుకేశారు. ఏకంగా మీడియా ముందుకొచ్చి.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్ర విధానాలు చాలా రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారాయని హేమంత్ సోరేన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు హేమంత్ సొరెన్‌ నేరుగా ప్రధానికి లేఖ రాశారు. త‌మ రాష్ట్రానికి క‌రోనా టీకాలు ఉచితంగా పంపించాల‌ని ఆ లేఖలో కోరారు. క‌రోనాతో ఇప్ప‌టికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌మ‌కు వ్యాక్సిన్ కొనుగోలు త‌ల‌కు మించిన భార‌మ‌వుతుంద‌ని వాపోయారు. అందువ‌ల్ల రాష్ట్రానికి టీకాలు పంపించి సహకరించాలని కోరారు. రాష్ట్రానికి అందుతున్న టీకాలు ఏమాత్రం స‌రిపోవ‌డం లేద‌ని… కేటాయింపుల్లో కేంద్రం ఏమాత్రం పారదర్శకత పాటించడం లేదని సోరెన్‌ ఆరోపించారు.

ఝార్ఖండ్ రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారికి కేంద్రమే ఉచితంగా కోవిడ్‌ టీకాలు అందచేస్తుంది. ఈ వర్గానికి టీకాలు అందజేయడానికి దాదాపు 1,100 కోట్లు రూపాయలు ఖర్చవుతుందని హేమంత్ సోరెన్ తెలిపారు. కరోనా వల్ల ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న తమ ఆర్థిక వ్యవస్థకు ఇది పెనుభారంగా మారే అవకాశం ఉందన్నారు. కావున కేంద్రమే ఈ వర్గానికి టీకాలు ఉచితంగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా టీకాలు అందించేందుకు అనుమతులు వస్తే.. మరో వేయి కోట్ల రూపాయల అవసరం అవుతుందని లేఖలో ప్రస్తావించారు. కేంద్రం నుంచి సరిపడా టీకా డోసులు ఝార్ఖండ్‌కు అందడం లేదని సోరెన్‌ తెలిపారు. రాష్ట్రాలే సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారని సోరెన్‌ అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న సమయంలో టీకాల సమీకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాలకు అందుతున్న టీకా ధరలు అధికంగా ఉన్నాయన్నారు.

ALSO READ: కరోనా రావడమే మంచిదట.. ఓసారి సోకి, వ్యాక్సిన్ వేసుకుంటే ఇక రక్షణే రక్షణ