Shivraj Singh Chouhan: గొప్ప మనసు చాటుకున్న సీఎం దంపతులు.. చిన్నారులతో కలిసి పాట పాడి.. డ్యాన్స్ చేసి..

దేశంలో కరోనా ఎంతటి బీభత్సం సృష్టించిందో అంత సులభంగా మర్చిపోలేం. ఎంతో మందిని పొట్టన పెట్టుకోవడంతో పాటు.. చాలా మంది చిన్నారులను అనాథలను చేసింది. అలాంటి పిల్లలు సమాజంలో ఎన్ని ఇబ్బందులకు..

Shivraj Singh Chouhan: గొప్ప మనసు చాటుకున్న సీఎం దంపతులు.. చిన్నారులతో కలిసి పాట పాడి.. డ్యాన్స్ చేసి..
Shivraj Singh Chouhan

Updated on: Oct 23, 2022 | 7:14 PM

దేశంలో కరోనా ఎంతటి బీభత్సం సృష్టించిందో అంత సులభంగా మర్చిపోలేం. ఎంతో మందిని పొట్టన పెట్టుకోవడంతో పాటు.. చాలా మంది చిన్నారులను అనాథలను చేసింది. అలాంటి పిల్లలు సమాజంలో ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీపావళి అంటేనే కాంతుల పండుగ. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పర్వదినం. అయితే కరోనా మహమ్మారికి చిక్కి అనాథలుగా మారిపోయిన చిన్నారుల సంగతేమిటి.. అందుకే అలాంటి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే ముందుకు వచ్చారు. సతీ సమేతంగా విచ్చేశారు. అనాథలమనే ఆలోచన చిన్నారుల్లో రాకుండా ఉండేందుకు వారితో కలిసి ఆడిపాడారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ ఏడాది దీపావళి వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకొన్నారు. భోపాల్‌లోని తన నివాసానికి చిన్నారులను ఆహ్వానించి, దంపతులు వారితో కలిసి ఆనందంగా గడిపారు. దీపాలు వెలిగించారు. సహపంక్తి భోజనం చేశారు. కొందరు చిన్నారులకు ఆయనే స్వయంగా తినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం శివరాజ్‌సింగ్‌ పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తూ వారిని ఆనందంలో ముంచెత్తారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 315 మంది చిన్నారులు పాల్గొన్నారు. సీఎం దంపతులు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. వేడుకల అనంతరం చిన్నారులు తమ ఆనందాన్ని పంచుకొని సీఎం దంపతులకు ధన్యవాదాలు చెప్పారు. కాగా.. పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చెప్పారు. గతేడాది దీపావళి వేడుకలు, ఈ ఏడాది రక్షా బంధన్‌ వేడుకలు కూడా చిన్నారుల సమక్షంలోనే ముఖ్యమంత్రి నిర్వహించుకున్నారు.

ఇవి కూడా చదవండి

 

పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు. అమ్మానాన్నలు లేకున్నా ప్రభుత్వం మీ వెంటే ఉంది. బాల ఆశీర్వాద యోజన, కోవిడ్ బాల సేవా యోజన ప్రారంభించాం. దీని ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తున్నాం. మీ చదువులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. కొవిడ్‌ కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం వాట్సాప్ గ్రూప్‌ను రూపొందిస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే అందులో చెప్పవచ్చు. నేనే వారితో కలిసి సమస్యను పరిష్కరిస్తాను. ఏడాదికోసారి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.

   – శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..