Army Chopper Crash: ఊటీలో కూలిన డిఫెన్స్ హెలికాప్టర్‌.. బిపిన్ రావత్‌తో పాటు కుటుంబ సభ్యులు..

| Edited By: Anil kumar poka

Dec 08, 2021 | 5:02 PM

తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

Army Chopper Crash: ఊటీలో కూలిన డిఫెన్స్ హెలికాప్టర్‌.. బిపిన్ రావత్‌తో పాటు కుటుంబ సభ్యులు..
Bipin Rawat
Follow us on

Army Chopper Crash: తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు.

తమిళనాడులోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇంతకీ ఈ హెలికాప్టర్ లో ఎవరెవరు ఉన్నారు.? ఎవరెవరికి గాయాలయ్యాయి.? లాంటి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో బిపీన్ రావత్ తో కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఆండియన్ ఆర్మీ ధృవీకరించింది.

ఎం ఐ హెలికాఫ్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో నలుగురు మరణించినట్లు అనధికారిక వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. నీలగిరి జిల్లా కూనుర్‌ వెల్లింగటన్‌లో సైనిక అధికారుల శిక్షణ కళాశాల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరుకావడానికి కొయంబత్తూరులోని ఆర్మీ సెంటర్‌ నుంచి హెలికాప్టర్‌లో ప్రయణించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంపై స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..

ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్ హెలికాప్టర్ లో ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరగడానికి గల కారణంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ వేదికగా తెలిపింది.

హెలికాప్టర్‌లో ఎవరెవరున్నారంటే..

ప్రమాదం జరిగి సమయంలో సీడీస్‌ బిపిన్‌ రావత్‌, సీడీఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గురుసేవక్‌ సింగ్ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), నాయక్‌ జితేందర్‌ కుమార్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), లాన్స్‌ నాయక్‌ సాయి తేజ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), హవాల్దార్‌ సత్పాల్‌ (పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) ఉన్నారు.

Read Also: ఊటీలో కూప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతో సహా 11మంది మృతి

మాస్క్ లేకుంటే అంతే.. ఆదేశాలు జారీ చేసిన దక్షిణమధ్య రైల్వే..

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు