
దేశంలోని తొలి ధాన్యం ఏటీఎంను చత్తీస్‌గఢ్ ప్రభుత్వం విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. బధవారం వైశాలీ నగర్‌లో ఎమ్మెల్యే రికేష్ సేన్ ఈ ఏటీఎంను అధికారికంగా ప్రారంభించారు. ఈ గ్రెయిన్ ఏటీఎం పూర్తి ఆటోమేటెడ్ విధానంలో పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. బయోమెట్రిక్ పూర్తయిన తర్వాత ఈ ఏటీఎం నుంచి ధాన్యం పొందవచ్చని తెలిపారు.
బ్యాంకింగ్ ఏటీఎంల మాదిరిగానే ఈ ధాన్యం ఏటీఎం కూడా 24/7 అందుబాటులో ఉంటుందని, లబ్ధిదారులు తమ అవసరాలకు బట్టి ఏటీఎం నుంచి రేషన్‌ను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏటీఎం రాకతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, డీలర్లు, మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దీని వల్ల అక్రమాలు జరగకుండా అరికట్ట వచ్చని స్థానిక ఎమ్మెల్యే సేన్ అన్నారు.
Why Urban Naxals & CONgress hate PM .@narendramodi Ji? Answer is here!
Had anyone even visioned this in Bharat? Modi Ji did it!Chhattisgarh BJP Govt has launched “Annapurti Grain ATM”, automated 24×7 system that lets eligible ration-card beneficiaries collect their allocated…
— BhikuMhatre (@MumbaichaDon) August 11, 2026
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలాగే రాబోయే రోజుల్లో పంచదార.. ఇతర నిత్యావసర సరుకుల కోసం కూడా ఇలాంటి ఏటీఎంలు తీసుకువచ్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు. కాబట్టి ఈ ఏటీఎం ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని.. ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఇకపై మధ్యవర్తుల హవా చెల్లదు, అవినీతి అంతమవుతుంది అని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏటీఎం e-PoS యంత్రంతో లింక్ చేయబడి ఉంటుందని.. లబ్ధిదారులు తమ రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసి, బయోమెట్రిక్ థంబ్ స్కాన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ధాన్యాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇందులోనే వెయిట్ మిషన్ ఉంటుందని.. తద్వారా లబ్ధిదారులు తమకు వచ్చిన ధాన్యాల బరువును కూడా సరిచూసుకోవచ్చని తెలిపారు. స్థానికులకే కాదు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.