Raipur Helicopter Crashes: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు స్పాట్ డెడ్ అయ్యారు. మృతి చెందిన పైలెట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవగా గుర్తించారు. గురువారం రాత్రి రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో రన్‌వే పై ప్రభుత్వ హెలికాప్టర్ కూలిపోయింది. స్పాట్‌లో ఒక పైలెట్ మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రైనింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, హెలికాప్టర్ ప్రమాదంతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. పైలెట్ల మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన సీఎం.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.