Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 13 మంది మృతి, 30 మందికి గాయాలు!

ఛత్తీస్‌గడ్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి ప్యాసింజర్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా రాయ్‌పూర్‌-బలోద బజార్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 13 మంది మృతి, 30 మందికి గాయాలు!

Updated on: May 12, 2025 | 10:40 AM

పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. వారితో పాటు నలుగురు చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ -బలోదబజార్‌ రోడ్డులోని సారగావ్‌ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున జరిగినట్టు తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. చటౌడ్ గ్రామానికి చెందిన కొందరు తమ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొనడానికి చౌతియా ఛత్తీ గ్రామానికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే వివాహం పూర్తయ్యాక ఓ వాహనంలో రాయ్‌పూర్‌కు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం బలోదబజార్‌ రోడ్డులోని సారగావ్‌ సమీపంలోకి రాగానే వేగంగా వచ్చిన ఓ ట్కక్కు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు.

సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలతో పాటు గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక మృతుల్లో తొమ్మిది మంది మహిళలతో పాటు నలుగు చిన్నారులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయ్‌పుర్‌ ఎస్పీ లాల్‌ ఉమ్మెద్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..