సినిమా స్ట్రైల్ లో రాబరీ జరిగింది. నగల షోరూమ్ లో 5కోట్ల విలువ చేసే నగలు, వజ్రాలు దోచుకెళ్లారు దొంగలు. చెన్నై శివారులోని పెరంబూర్ పేపర్ మిల్స్ రోడ్డులోని నగల షోరూమ్‌లో దొంగలు 5కోట్ల రూపాయలు విలువ చేసే 10 కిలోల బంగారం, కోటి రూపాయల వజ్రాలు ఎత్తుకెళ్లారు. పేపర్ మిల్స్ సమీపంలోని రెండస్థుల భవనంలో జెఎల్ గోల్డ్ షాపు యాజమాని శ్రీధర్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది సంవత్సరాలుగా జేఎల్ గోల్డ్ ప్యాలెస్ షాపును నడుపుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి నగల దుకాణాన్ని మూసివేశాడు.
అయితే తర్వాత రోజు ఉదయాన్నే షాప్ తెరిచి చూసి షాక్ కు గురయ్యాడు. నగలు చోరీకి గురైనట్లు గుర్తించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాపును ఆనుకొని ఉన్న గుడి వెనుక నుంచి షోరూమ్ షట్టర్‌కి దుండగులు వెల్డింగు మిషన్‌తో కత్తిరించి దోపిడీ చేసినట్లు గుర్తించారు. ఎక్కడ ఆనవాళ్లు దొరకకుండా షోరూమ్ లోని సీసీటీవీ హార్డ్ డిస్క్‌ను కూడా తీసుకువెళ్లిపోయారు.
కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దొంగల కోసం వేటాడుతున్నారు. రాబరీ గ్యాంగ్ ని పట్టుకోవడానికి తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అటు దేవాలయంలోని సీసీ విజువల్స్.. గోల్డ్ షోరూం ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్స్ లోని విజువల్స చెక్ చేస్తున్నారు. అలాగే మెయిన్ రోడ్డులోని యాక్టివిటీస్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..