Metro Rail: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన మెట్రో ఛార్జీలు.. టికెట్‌పై రూ.20 తగ్గింపు

|

Feb 20, 2021 | 9:30 PM

Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా రూ.70 ఉన్న మెట్రో ఛార్జీపై రూ.20 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ..

Metro Rail: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన మెట్రో ఛార్జీలు.. టికెట్‌పై రూ.20 తగ్గింపు
Follow us on

Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా రూ.70 ఉన్న మెట్రో ఛార్జీపై రూ.20 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెట్రో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శుభవార్త చెన్నైలోని మెట్రో ప్రయాణికులకు అందింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తాజాగా మెట్రో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వకు గరిష్ఠంగా రూ.70గా ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.20 మేర తగ్గించి రూ.50కి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త టికెట్‌ ఛార్జీలు ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ఇకపై మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10, రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 5 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.30, 12 నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.40, అలాగే 21 నుంచి 32 కిలోమీటర్ల వరకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక అంతకు ముందు 0-2 కిలోమీటర్లకు రూ.10, 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు రూ.20, అలాగే 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు రూ.30, 6 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.40, 12 నుంచి 18 కిలోమీటర్ల వరకు రూ.50, ఇక 18 నుంచి 24 కిలోమీటర్ల వరకు రూ.60, 24 కిలోమీటర్ల పైబడిన దూరానికి రూ.70 ఉండేది. అలాగే చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ స్మార్ట్‌కార్డ్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లించి వారికి రూ.20 శాతం రాయితీ ఇస్తున్నట్లు పళనీస్వామి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు పబ్లిక్‌ హాలిడే, ఆదివారాల్లో రోజువారీ టికెట్‌పై రూ.50శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది సీఎం పళనీ స్వామి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Also Read: Viral Video: వందేళ్ల బామ్మ అందమైన జీవితానికి ఐదు సూత్రాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో