రూబిక్ క్యూబ్ (Rubik Cube) ను పరిష్కరించడం అంత సులభమైన విషయమేమీ కాదు. దీనికి ఎంతో మేథోసంపత్తి కావాలి. స్పష్టమైన అవగాహన ఉండాలి. దృష్టినంతా చేస్తున్న పనిపైనే కేంద్రీకరించాలి. దాని ఫార్ములా (Formula) తెలుసుకోవాలి. అప్పుడే క్యూబ్ పరిష్కారం చేయడం సాధ్యమవుతుంది. కానీ ఓ బాలుడు మాత్రం రూబిక్ క్యూబ్‌ను క్షణాల్లో సాల్వ్ చేశాడు. కేవలం 14 సెకన్లలోనే దాన్ని సాల్వ్ చేసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. అది కూడా సైకిల్ తొక్కుతూ రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆ బాలుడి రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై కు చెందిన జయదర్శన్ వెంకటేశన్ అనే బాలుడు కేవలం 14.32 సెకండ్లలో రూబిక్ క్యూబ్‌ను సైకిల్ తొక్కుతూ సాల్వ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. దాదాపు రెండేళ్లుగా జయదర్శన్.. రూబిక్ క్యూబ్‌ను వేగంగా సాల్వ్ చేసే టెక్నిక్‌ను నేర్చుకుంటున్నాడట. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు.
ఇవీ చదవండి
White Bread: బ్రెడ్ మరీ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..
Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..
Telangana: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు రౌండప్.. తక్షణమే అమల్లోకి