చెన్నైలో గొప్ప మనసు చాటుకున్న ఆటోవాలా.. నిజాయితీలో తనకు సాటిలేదనిపించాడు.. అందరి మనసు దోచేశాడు..!

ఆటోలో పోగొట్టుకున్న 50 సవర్ల నగలను తిరిగి సొంతదారునికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఆటో డ్రైవర్‌.

చెన్నైలో గొప్ప మనసు చాటుకున్న ఆటోవాలా.. నిజాయితీలో తనకు సాటిలేదనిపించాడు.. అందరి మనసు దోచేశాడు..!

Updated on: Jan 29, 2021 | 2:37 PM

Auto driver honesty : ఒక్కసారి పోగొట్టుకున్న సొమ్ము అంతా ఈజీ దొరుకుతుందనుకుంటే అంతా సులువు కాదు. మరీ ముఖ్యంగా లక్షల్లో విలువ చేసే బంగారం అయితే ఇక అంతే సంగతులు. అలాంటిదీ, ఆటోలో పోగొట్టుకున్న 50 సవర్ల నగలను తిరిగి సొంతదారునికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఆటో డ్రైవర్‌. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలోని క్రోంపేట సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

క్రోంపేటకు చెందిన ఆల్‌బ్రైట్‌ వ్యాపారుల సంఘం నేత.. ఇతని కుమార్తెకు గురువారం ఉదయం అదే ప్రాంతంలో వున్న చర్చిలో వివాహం జరుగనుంది. ఇదే ఈ క్రమంలో గురువారం ఉదయం చర్చి నుంచి ఆటోలో ఆల్‌బ్రైట్‌ ఇంటికి వెళ్లాడు. రూ. 20 లక్షల విలువ కలిగిన 50 సవర్ల నగల సంచిని ఆటోలో పెట్టి మరిచి దిగిపోయారు.ఇంటికి వెళ్లిన తరువాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్‌బ్రైట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇదిలావుంటే, ఆటోలో నగల సంచి ఉండడం గమనించిన ఆటో డ్రైవర్‌ శరవణకుమార్‌ (30) ఆ నగలను తీసుకుని క్రోంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. నగలను పోలీసులు సరి చూసి ఆల్‌బ్రైట్‌ నిర్ధారణ చేసిన తరువాత అతని చేతికి అందించారు. 50 సవర్ల నగలు తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్న శరవణ కుమార్‌ను పోలీసులు అభినందించారు.

Read Also..  మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా మరో కీలక ఒప్పదం.. పూణేకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు ఎంవోయూ