ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల అయ్యాయి. రూ.18 వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలోకి జమ చేశారు. దేశ వ్యాప్తంగా సుమారు 9 కోట్ల రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కాగా, ఐదు ఎకరాలలో లోపు ఉన్న ప్రతీ రైతుకు ఎకరాకు రూ.2వేల చొప్పున ప్రభుత్వం నగదును అందజేస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 6 విడతలు నగదు జమచేశారు. తాజాగా 7 విడత నగదును రైతుల అకౌంట్లలో వేశారు. ఈ నేపథ్యంలోనే మీరు అర్హులు అయితే… మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి….
పీఎం కిసాన్ నిధి నగదు తమ ఖాతాలో పడిందా లేదా అనే విషయాన్ని రైతులు pmkisan.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌లో Kisan Corner అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్టేటస్‌లోకి వెళ్లాలి. అక్కడ లబ్ధిదారులు తమ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, గెట్ రిపోర్ట్‌ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు పొందవచ్చు.
– ఒకవేళ నగదు రైతుల అకౌంట్‌లోకి జమకాకపోయినా.. రిపోర్టులో FTO (Fund Transfer Order) అని వచ్చినట్టయితే.. లబ్ధిదారులు నిరాశ చెందాల్సిన పని లేదు. త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు పడతాయని అర్థం. ఇతర సమాచారం కోసం పీఎం కిసాన్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ విభాగానికి చెందిన టోల్‌ఫ్రీ నంబర్ 18001155266, హెల్ప్‌లైన్ నంబర్ 155261, ల్యాండ్‌లైన్ నంబర్లు 011—23381092, 23382401, 011-24300606. 0120-6025109 లలో సంప్రదించాలి. లేదా… సమస్యలు, ప్రశ్నలు ఇంకా ఇతర ఏ సమస్యలున్నా పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ pmkisan-ict@gov.in . కి మెయిల్ చేయండి.