AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేమూ యూపీ దారిలోనే ! మత మార్పిడుల నిరోధక బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం, చట్టమైతే 10 ఏళ్ళ జైలుశిక్ష

మత మార్పిడుల నిరోధక బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉత్తర ప్రదేశ్ తరువాత ఈ విధమైన చట్టాన్ని తెచ్చిన రెండో రాష్ట్రమైంది. ఈ బిల్లును మూజువాణీ ఓటుతో ఆమోదించినట్టు..

మేమూ యూపీ దారిలోనే ! మత మార్పిడుల నిరోధక బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం, చట్టమైతే 10 ఏళ్ళ జైలుశిక్ష
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 26, 2020 | 1:14 PM

Share

మత మార్పిడుల నిరోధక బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉత్తర ప్రదేశ్ తరువాత ఈ విధమైన చట్టాన్ని తెచ్చిన రెండో రాష్ట్రమైంది. ఈ బిల్లును మూజువాణీ ఓటుతో ఆమోదించినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇది చట్టమైతే నిందితులకు గరిష్టంగా 10 ఏళ్ళ జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామన్నారు. వారితో బాటు ఇందుకు బాధ్యులైనవారు కూడా శిక్షార్హులే అని స్పష్టం చేశారు. ‘ధర్మ స్వాతంత్య్ర ( మత స్వేచ్ఛ) బిల్లు-2020 పేరిట ఈ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ సమావేశానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం-బలవంతంగా మత మార్పిడిలు చేసినవారికి 1 నుంచి 5 ఏళ్ళ జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. కన్వర్ట్ అయిన వ్యక్తులు  ఎస్సీ, లేదా ఎస్టీ అయి ఉంటే ఇందుకు బాధ్యులైనవారికి రెండు నుంచి 10 ఏళ్ళ జైలు శిక్ష, లక్ష రూపాయల ఫైన్ తప్పదు. బలవంతపు మత మార్పిడులకు పాల్పడేవారిని , సాక్ష్యాలను తారుమారు చేసేవారిని తాము సహించే ప్రసక్తి లేదని సీఎం చౌహాన్ ఇటీవల హెచ్ఛరించారు.

యూపీలో ఈ విధమైన చట్టం తెచ్చిన అనంతరం పలు బలవంతపు మత మార్పిడుల కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న యూపీలోని బిజ్నూర్ లో లవ్ జిహాద్ పేరిట దాఖలైన కేసులో పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత