
బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత.. అంతేకాకుండా.. మమతకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మమత బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్ల దొంగ అని సభలో సీఎం మమత నినాదాలు చేయడం సంచలనం రేపింది. విపక్ష నేత సువేందు అధికారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీఎంసీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఓటమి భయం తోనే బీజేపీ నేతలు సభలో గొడవలు చేస్తున్నారని అన్నారు మమత . బీజేపీ నేతలు దొంగలు మాత్రమే కాదు.. బందిపోట్లు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అసెంబ్లీలో లోపల టీఎంసీ , బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. మార్షల్స్ రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు బాటిళ్లు విసరడంతో గొడవ మరింత ముదిరింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ గొడవలో కొంతమంది ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..