Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్ర బడ్జెట్‌ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ

|

Aug 17, 2024 | 6:50 AM

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్ర బడ్జెట్‌ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ
Pm Modi Cm Chandrababu
Follow us on

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. సాయంత్రం శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈసమావేశంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి విందులో పాల్గొన్నారు చంద్రబాబు.

మరోవైపు ఇవాళ సాయంత్రం 4.30గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. బడ్జెట్ హామీలపై చర్చిస్తారు. అంతేకాకుండా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల టాక్. ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా రూ.15వేల కోట్లను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీమ్ కూడా అమరావతి వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రుణాల రీషెడ్యూల్ కి సంబంధించి ప్రధాని మోదీకి చంద్రబాబు వినతిపత్రం ఇవ్వనున్నారు. కేంద్ర బడ్జెట్‌ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

అనంతరం సాయంత్రం 6గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర బడ్జెట్‌లో స‌వ‌రించిన అంచ‌నాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాల‌ని కోరనున్నారు. అలాగే విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాల‌పై చ‌ర్చిస్తారు. తర్వాత సాయంత్రం 7గంటలకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సుదీర్ఘంగా చర్చిస్తారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని కోరనున్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమిక‌ల్ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్‌ సింగ్ పూరీతో మరోసారి చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. దీనికోసం కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరితో బేటీ అవుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..