Chandigarh University: దేశాన్ని షేక్ చేసిన ‘వీడియో లీక్స్’ ఇష్యూకు ఎండ్ కార్డ్.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..

Chandigarh University: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన చండీగఢ్‌ యూనివర్సిటీ ఇష్యూకు ఎండ్‌ కార్డు పడింది. నిందితుల అరెస్ట్‌తో విద్యార్థులు తమ ఆందోళనను..

Chandigarh University: దేశాన్ని షేక్ చేసిన ‘వీడియో లీక్స్’ ఇష్యూకు ఎండ్ కార్డ్.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..
Chandigarh University Mms V

Updated on: Sep 20, 2022 | 8:25 AM

Chandigarh University: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన చండీగఢ్‌ యూనివర్సిటీ ఇష్యూకు ఎండ్‌ కార్డు పడింది. నిందితుల అరెస్ట్‌తో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పర్చగా.. రిమాండ్‌కు తరలించారు. పంజాబ్‌లోని చండీగఢ్​ యూనివర్సిటీ విద్యార్థుల ప్రైవేట్ వీడియోల లీక్​ కేసులో సిమ్లాకు చెందిన ఇద్దరు నిందితులతో పాటు.. యూనివర్సిటీ విద్యార్థినిని అరెస్టు చేశారు పోలీసులు. దాంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించారు. సన్నీ మెహతా, రాంకజ్ వర్మ అనే ఇద్దరు నిందితులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితులను పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో అరెస్టైన నిందితుడు సున్నీ మోహతా.. నిందితురాలి ప్రియుడు. సిమ్లాలోని రోహ్రుకు చెందిన సన్నీ బీఏ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం తన సోదరుడితో కలిసి ఓ కేక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.

మరో నిందితుడు రాంకజ్ వర్మ.. సిమ్లాలోని థియోగ్ నివాసి. అతడు ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తన ప్రైవేట్ వీడియోను తన ప్రియుడికి షేర్ చేసిందని చండీగఢ్‌ యూనివర్సిటీ తెలిపింది. వేరే విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలను కూడా ఆమె తీసిందనడంలో నిజం లేదంటోంది యూనివర్సిటీ. ఏడుగురు అమ్మాయిలు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డారని వచ్చిన వార్తలన్నీ అవాస్తవం వర్సిటీ అధికారులు ప్రకటించారు. మరోవైపు చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులు తమ నిరసనలను విరమించారు. అధికారులు, పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళనలు నిలిపివేశారు. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు వార్డెన్‌లను సస్పెండ్ చేశారు అధికారులు. ఈ నెల 24 వరకు తరగతులకు రద్దు చేశారు. విద్యార్థుల సమస్యలపై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..