స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం..

|

May 03, 2023 | 5:18 PM

స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. LGBTQల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు కేబినేట్‌ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని బుధవారం సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.

స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం..
Same Gender Couple
Follow us on

స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. LGBTQల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు కేబినేట్‌ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని బుధవారం సుప్రీం కోర్టుకు  తెలిపింది. సామాజిక హక్కులకు దూరమవుతున్న స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించాలని ఏప్రిల్‌ 27న సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. అయితే ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ స్పందించింది. కేంద్రం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. LGBTQల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ధర్మాసనానికి స్పష్టం చేశారు. అయితే వివాహ చట్టబద్ధత అంశం లేకుండా కమిటీ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. ఇది ఒక మంత్రిత్వశాఖ పరిధిలో మాత్రమే జరిగే అంశం కాదని.. అనేక మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో జరగాలని సూచించారు.

సమస్యల పరిష్కారం కోసం ఏమేం చేయాలో LGBTQలు కూడా తమ సలహాలు, సూచనలు కమిటీకి ఇవ్వొచ్చని మెహతా కేంద్రం తరుపున వివరించారు. ఇన్షూరెన్స్‌ పాలసీల్లో భాగస్వామిని నామినీగా చేసే విషయం, జాయింట్‌ బ్యాంకు ఖాతాల వంటి అనేక అంశాల్లో LGBTQలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానానికి తెలియజేశారు. మరోవైపు జస్టిస్​డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై గత కొన్నిరోజులుగా విచారణ జరుపుతోంది. ఏప్రిల్ 27న ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. స్వలింగ జంటల వివాహాన్ని చట్టబద్ధం చేయకుండా సామాజిక సంక్షేమ ప్రయోజనాలను అందేలా చేయొచ్చా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే తాజాగా కేంద్రం ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపడతామని స్పందించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..