Rural Grants: కరోనా విలయం.. కేంద్రం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థలకు రూ. 8,923 కోట్లు విడుద‌ల‌

|

May 09, 2021 | 3:59 PM

Centre Releases rs 8,923 Crore For Rural Bodies: దేశంలో కరోనా సెకండ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు, వేలాది మరణాలు

Rural Grants: కరోనా విలయం.. కేంద్రం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థలకు రూ. 8,923 కోట్లు విడుద‌ల‌
grants
Follow us on

Centre Releases rs 8,923 Crore For Rural Bodies: దేశంలో కరోనా సెకండ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశమంతటా ఆందోళన నెలకొంది. కాగా.. క‌రోనా విజృంభిస్తున్న తరునంలో 25 రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ.8,923 కోట్ల నిధుల‌ను ఆదివారం విడుద‌ల చేసింది. పంచాయ‌తీ రాజ్ ప‌రిధిలోని మూడు అంచెలైన గ్రామం, బ్లాక్‌, జిల్లా స్థాయిల‌కు ఈ నిధులను విడుదల చేసింది. క‌రోనా నియంత్ర‌ణ‌కు అవ‌స‌రమైన వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

కాగా, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు తొలి విడ‌త నిధుల‌ను జూన్‌లో కేంద్రం విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే దేశంలో క‌రోనావైరస్ వ్యాప్తి తీవ్రమైన నేప‌థ్యంలో నియంత్ర‌ణ చ‌ర్య‌ల కోసం వీటిని ఒక నెల ముందుగానే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతోపాటు నిధుల విడుద‌ల‌కు అడ్డంకిగా ఉన్న నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి గ్రాంట్స్‌ను కరోనా కట్టడి కోసం విడుదల చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా.. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. వ‌రుస‌గా రెండో రోజూ కూడా నాలుగు వేల‌ మందికి పైగా బాధితులు మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,738 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 4,092 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కు చేర‌గా, మరణాల సంక్య 2,42,362కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 37,36,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Also Read:

Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు.. మెట్రో సర్వీసులు కూడా బంద్..

Assam CM: ఉత్కంఠకు తెర.. అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ..