కేంద్రం నిధుల విడుదల… జీఎస్టీ బకాయిలు రాష్ట్రాలకు చెల్లింపు… 42 వేల కోట్ల అప్పులు చేసిన కేంద్రం…

| Edited By:

Dec 15, 2020 | 2:15 PM

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించింది. డిసెంబర్ 14న దాదాపు 6 వేల కోట్ల నిధులను ఏడో విడుతలో భాగంగా 25 రాష్ట్రాలకు అందించింది.

కేంద్రం నిధుల విడుదల... జీఎస్టీ బకాయిలు రాష్ట్రాలకు చెల్లింపు... 42 వేల కోట్ల అప్పులు చేసిన కేంద్రం...
Follow us on

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించింది. డిసెంబర్ 14న దాదాపు 6 వేల కోట్ల నిధులను ఏడో విడుతలో భాగంగా 25 రాష్ట్రాలకు అందించింది. కాగా మిగితా రాష్ట్రాలకు ఎటువంటి జీఎస్టీ బకాయిలు లేవని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్ను నగదులో దాదాపు 1.10 లక్షల కోట్లు లోటు ఉందని కేంద్రం తెలిపింది. కానీ రాష్ట్రాల అభివృద్ధికి, జీఎస్టీ బకాయిల చెల్లింపు కోసం ఇప్పటి వరకు 40 వేల కోట్ల అప్పులు చేసినట్లు తెలిపింది. నూతన భారతీయ చట్టం ప్రకారం దేశ జీడీపీలో 0.5 శాతం మేర రుణాలు తీసుకునే వెసులు బాటుకు కేంద్రం కల్పించిందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ లెక్కన కేంద్రానికి 1 లక్ష కోట్ల రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది.

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రాన్ని జీఎస్టీ బకాయిలు చెల్లించాలని కోరుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీతో జీఎస్టీ నిధుల గురించి యుద్ధానికి సైతం దిగారు. తమకు రావాల్సిన నిధులను ఇవ్వాలని పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను తాజాగా విడుదల చేసింది.