Medical Treament: విమానంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యపాలయ్యాడు. ఈలోపు ఓ వ్యక్తి వచ్చి అతనికి వైద్య సహాయం అందించారు. వైద్యం చేసిన ఆ వ్యక్తిని గుర్తుపట్టిన తోటి ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆయన కేంద్ర మంత్రి. సమయానికి ఆయన స్పందించి వైద్య సహాయం చేయకపోతే ఆ వ్యక్తికి మరింత ప్రమాదం జరిగేదని చెబుతున్న తోటి ప్రయాణీకులు మంత్రి చేసిన సహాయాన్ని పొగుడుతూ ట్వీట్ చేస్తున్నారు. సంఘటన పూర్తి వివరాలు ఇవీ..
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ సోమవారం రాత్రి ఢిల్లీ-ముంబై విమానంలో సహ ప్రయాణికుడికి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. ఢిల్లీ నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడికి కళ్లు తిరిగి, స్పృహతప్పి పడిపోయాడు. వృత్తి రీత్యా సర్జన్ అయిన డాక్టర్ కరాద్, విమానంలోని ఎమర్జెన్సీ కిట్ నుండి రోగికి ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ కూడా ఇచ్చారు. రోగి చెమటతో తడిసి ఉన్నాడని, అతని బీపీ తక్కువగా ఉందని కరద్ చెప్పాడు. అతని షర్ట్ తొలగించి ఛాతీకి మసాజ్ చేశారు. దాదాపు 30 నిమిషాల తర్వాత ప్రయాణికుడి పరిస్థితి మెరుగుపడింది. అతను రోగిని తన కాళ్ళను పైకి లేపమని, ప్రతి నిమిషం తన స్థానాన్ని మార్చమని అడగడం ద్వారా అసౌకర్యాన్ని తగ్గించాడు. సమాచారం ప్రకారం, రోగికి 40 సంవత్సరాలు, విమానం ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత చికిత్స కోసం తీసుకువెళ్లారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ విమానంలో ప్రయాణీకునికి వైద్యం చేస్తున్న ఫోటో షేర్ చేసిన ట్వీట్ ఇదే..
Our heartfelt gratitude and sincere appreciation towards MoS for ministering to his duties non-stop! @DrBhagwatKarad your voluntary support for helping out a fellow passenger is ever so inspiring. https://t.co/I0tWjNqJXi
— IndiGo (@IndiGo6E) November 16, 2021
సోషల్ మీడియాలో కూడా డాక్టర్ కరాద్ పని తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన సహాయానికి కేంద్ర మంత్రిని ప్రశంసిస్తూ, ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. ”మంత్రి తన విధులను నిరంతరాయంగా నిర్వహిస్తున్నందుకు మేము అభినందిస్తున్నాము. తోటి ప్రయాణికుడికి సహాయం చేయడంలో డాక్టర్ భగవత్ కరద్ సహకారం స్ఫూర్తిదాయకం.” అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ తన ట్వీట్ లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి: Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..
Thyroid Disease: మహిళలకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!