Sugarcane: చెరకు రైతులకు తీపి కబురు.. క్వింటాల్‌కు పంట ధరలు పెంచిన కేంద్రం

చెరకు రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. చెరకు పంటకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చెరకు పంటకు ప్రతి ఏడాది ప్రకటించే..

Sugarcane: చెరకు రైతులకు తీపి కబురు.. క్వింటాల్‌కు పంట ధరలు పెంచిన కేంద్రం
Sugarcane

Edited By:

Updated on: Jun 29, 2023 | 7:31 AM

చెరకు రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. చెరకు పంటకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చెరకు పంటకు ప్రతి ఏడాది ప్రకటించే ఫెయిర్‌ అండ్‌ రెమ్యునరేటివ్‌ ప్రైస్‌ రేటును ఈ సీజన్‌లో రూ.10 చొప్పున పెంచి.. రూ.315 గా నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ రేట్లను పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 5కోట్ల మంది చెరకు రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అక్టోబర్‌ నుంచి ప్రారంభమయ్యే సీజన్‌లో చక్కెర కర్మాగారాలు రైతులకు ఒక క్వింటాల్‌పై రూ.315గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతేడాది ఈ ధరలు రూ.305గా ఉండగా.. 2023-24 ఏడాదికి గాను రూ.10 పెంచుతూ క్వింటాల్‌పై రూ.315గా కేంద్రం నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ అన్నారు.

మరో విషయం ఏంటంటే దేశంలో పరిశోధన సామర్థ్యాన్ని సైతం మెరుగుపర్చేలా నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో పార్లమెంట్‌లో చట్టం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ పాలక బోర్డులో 15 నుంచి 25 మంది పరిశోధకలు, నిపుణులను నిమమించనున్నట్లు సమాచారం. అయితే ఈ బోర్డుకు ప్రధానమంత్రి నేతృత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా దేశంలో ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువులు వాడేలా రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు PM-PRANAM అనే కొత్త పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం