Israeli Embassy blast case: పేలుడు ఘటనను ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం.. ఇరాన్ ప్రమేయంపై దర్యాప్తు

|

Feb 02, 2021 | 3:36 PM

ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబ‌సీ వ‌ద్ద జ‌రిగిన పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అనేక కోణాల్లో..

Israeli Embassy blast case: పేలుడు ఘటనను ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం.. ఇరాన్ ప్రమేయంపై దర్యాప్తు
Israel Embassy Blast
Follow us on

Israeli Embassy blast case: ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబ‌సీ వ‌ద్ద జ‌రిగిన పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్ఐఏ జ‌న‌వ‌రి 29వ తేదీన ఇజ్రాయిల్ రాయ‌బార కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగిన పేలుడు ఘ‌ట‌న‌ విచార‌ణ‌ను మళ్లీ మొదటినుంచి ప్రారంభించనుంది. అయితే పేలుడు సంభ‌వించిన ప్రాంతాల నుంచి స్పెష‌ల్ సెల్ పోలీసులు సేక‌రించిన అన్ని ఆధారాల‌ను ఎన్ఐఏకు అందించనున్నారు.

ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు పేలుడు జ‌రిగిన ప్రాంతాన్ని సైతం పరిశీలించారు. ఈ ఘటనలో ఇరాన్ ప్రమేయంపై కూడా అధికారులు దర్యాప్తు చేయనున్నారు. అయితే ఈ కేసులో ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసులు ఇప్పటి వ‌ర‌కు ఎటువంటి అనుమానితుల‌ను గుర్తించ‌లేక‌పోయారు. కాగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమ‌న్ నేతాన్యాహు ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం మాట్లాడారు. దర్యాప్తు చేపడుతున్నామని.. నేరస్థులను తప్పకుండా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నేతన్యాహుకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయాల భద్రతకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.

Also Read:

Fact Check: ఢిల్లీ అల్లర్ల అనంతరం 200 మంది పోలీసులు రాజీనామా చేశారా? అసలు నిజాన్ని వెల్లడించిన పోలీసులు

ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు