Nizamabad Turmeric Board: తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం మరోసారి నీరుగార్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదంటూ కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది. పసుపు బోర్డుకు బదులు.. సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం కేంద్ర వాణిజ్యశాఖ, స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేశామని కేంద్రం గుర్తు చేసింది. పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని వెల్లడించింది.
ఈ మేరకు రాజ్యసభలో కేఆర్ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి ప్రాంతీయ బోర్డు కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు పెట్టే ఆలోచన ఏదీలేదని ఆయన ప్రకటించారు.
ఇదిలాఉంటే.. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాను ఎంపీగా గెలిస్తే.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని ధర్మపురి అర్వింద్ రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితపై అర్వింద్‌కు విజయం సాధించారు. అప్పటి నుంచి కూడా పసుపు బోర్డు ఏర్పాటుపై రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణలో ఎన్నికల నాటినుంచి వివాదం నెలకొని ఉంది. తాజాగా పసుపు బోర్డుపై కేంద్రం చేసిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై నీళ్లుచల్లినట్లయింది.
Also Read: