Corona Vaccine: మిక్స్ంగ్‌ టీకా.. కేంద్రం సరికొత్త వ్యాక్సిన్‌ ప్లాన్‌.. ఇవిగో వివ‌రాలు

|

Jun 01, 2021 | 12:04 PM

ఫస్ట్‌ డోసులో ఒక ర‌కం వ్యాక్సిన్‌, రెండో డోసులో మరో సంస్థకు వ్యాక్సిన్ వేసుకుంటే కరోనాకు వ్యతిరేకంగా శరీరంలో యాంటిబాడీస్ పెరుగుతాయా? ప్రస్తుతం దేశంలో

Corona Vaccine: మిక్స్ంగ్‌ టీకా.. కేంద్రం సరికొత్త వ్యాక్సిన్‌ ప్లాన్‌.. ఇవిగో వివ‌రాలు
Corona Vaccine
Follow us on

ఫస్ట్‌ డోసులో ఒక ర‌కం వ్యాక్సిన్‌, రెండో డోసులో మరో సంస్థకు వ్యాక్సిన్ వేసుకుంటే కరోనాకు వ్యతిరేకంగా శరీరంలో యాంటిబాడీస్ పెరుగుతాయా? ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వినియోగిస్తున్న కొవిషీల్డ్‌ సింగిల్‌ డోసుతోనే క‌రోనాను ఎదిరించ‌వ‌చ్చా.. దేశంలో జ‌నాభా అధికంగా ఉండ‌టం,వ్యాక్సిన్ కొర‌త ఉండ‌టం.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆల‌స్యం అవుతుండటంతో.. కేంద్రప్రభుత్వం కొత్త అడుగులు వేస్తుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల రోజుల్లో ‘కొత్త వ్యాక్సిన్‌ ప్లాన్‌’ ప్రయోగాలు మొదలుకానున్నాయి. అయితే ఇప్పటివరకు మొదటి డోస్‌లో ఏ సంస్థ‌కు చెందిన టీకా వేసుకుంటారో.. రెండో డోసు కూడా అదే సంస్థ వ్యాక్సిన్ వేసుకోవాలనే విధానం ఉంది. కానీ, ఇకపై రెండు డోసులు రెండు వేర్వేరు టీకాలు వేసే విధానంపై కేంద్ర ప్రభుత్వం ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతుంది. అంతేగాకుండా, కొవిషీల్డ్ ను ఒకే ఒక్క డోసును ఇచ్చే అంశంపై కూడా నిపుణులు స‌ల‌హాలు తీసుకుంటుంది. రెండు వేర్వేరు టీకాల డోసులను ఇవ్వడానికి సంబంధించి మరో నెలలో ట్రయల్స్ స్టార్ట‌య్యే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు లేదా రెండున్నర నెలల్లో ఆ ట్రయల్స్ ను పూర్తి చేస్తారని అంటున్నాయి. అదే సమయంలో కొవిషీల్డ్ సింగిల్ డోస్ పైనా ట్రయల్స్ జరుగుతాయని స‌మాచారం అందుతోంది.

ఆ ట్రయల్స్ కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాలను అందులో నమోదు చేయడం ఈజీ అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఆ యాప్ ను కొవిన్ తో లింక్ చేసి, తద్వారా వ్యాక్సిన్ వేసుకున్న వారు తమకు కలిగిన ఇబ్బందులను తెలియజేయడానికి సులువు అవుతుందని అంటున్నారు. కాగా, కొవిషీల్డ్ సింగిల్ డోస్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఇటీవలి ప‌రిశోధ‌న‌ల్లో తేలడంతో ఆ దిశగా ట్రయల్స్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Also Read: హైద‌రాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

ఇండియాలో కొత్త‌గా 1,27,510 క‌రోనా కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా