National News: దేశ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త.. నిన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరల తగ్గింపు.. నేడు..

National News: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతోంది. దీపావళి సందర్భంగా ధరలను తగ్గిస్తూ కీలక ప్రకటనలు చేస్తోంది. నిన్న పెట్రోల్ ధరలను తగ్గించిన కేంద్రం..

National News: దేశ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త.. నిన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరల తగ్గింపు.. నేడు..
Oil Price India

Edited By:

Updated on: Nov 05, 2021 | 6:58 PM

National News: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతోంది. దీపావళి సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. దీపావళి రోజున పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తోడుగా పలు రాష్ట్రాలు కూడా తమవంతుగా ధరలను తగ్గించాయి దీంతో కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా రూ. 12 తగ్గింది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం ప్రజలకు మరో శుభవార్త తెలిపింది.

దేశవ్యాప్తంగా వంటనూనె ధరలను క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. గత కొన్ని రోజుల వ్యవధిలో లీటర్ వంట నూనెపై రూ. 7 నుంచి, రూ. 20 వరకు తగ్గించినట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18, సోయాబీన్‌పై రూ. 10, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై రూ. 7 తగ్గినట్లు తెలిపింది. దీంతో గత కొన్నిరోజులుగా ధరల పెరుగుదలతో సతమతమైన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.

ఇక దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ధరలను స్థీరకరించడంలో భాగంగానే మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంధన ధరల తగ్గుదుల ఇతర ధరలపై కూడా ప్రభావం చూపుతుందని, కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని వస్తువుల ధరల్లోనూ తగ్గుదుల ఉంటుందని కొందరు ఆర్థిక వేత్తలతో పాటు, బీజేపీ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: T20 World Cup 2021: నేడు కోహ్లీకి వెరీ స్పెషల్ డే కానుందా? ఆ రెండు కోరికలు నెరవేరితే భారత సారథి నక్కతోక తొక్కినట్లే..!

కార్తీక మాసం విశిష్టత ఏంటో మీకు తెలుసా?

Crime News: ఐటీ అధికారినంటూ ఘరానా మోసం.. నగలతో ఉడాయించిన వైనం