AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vehicle Fitness New Rules: వాహన ఫిట్​నెస్​ టెస్ట్​ ఇక అలా కుదరదు.. కేంద్రం న్యూ గైడ్ లైన్స్..

Vehicle Fitness New Rules:  వాహనాల ఫిట్​నెస్​ టెస్ట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికేషన్ జారీని మరింత కచ్చితత్వంతో నిర్వహించేందుకు కొత్త పద్ధతిని తప్పనిసరి చేసింది.

Vehicle Fitness New Rules: వాహన ఫిట్​నెస్​ టెస్ట్​ ఇక అలా కుదరదు.. కేంద్రం న్యూ గైడ్ లైన్స్..
cars
Ayyappa Mamidi
|

Updated on: Apr 07, 2022 | 7:15 PM

Share

Vehicle Fitness New Rules:  వాహనాల ఫిట్​నెస్​ టెస్ట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆటోమేటెడ్ టెస్టింగ్(Automated Testing) స్టేషన్ల ద్వారా మాత్రమే ఈ పరీక్షలను నిర్వహించేలా.. కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​ నుంచి దశల(Phased Manner) వారీగా కొత్త విధానాన్ని అమలుకు సిద్ధమైంది. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల ద్వారా ఈ పరీక్ష చేపట్టడం వల్ల.. పొరపాట్లు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండటాయని కేంద్రం యోచిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల రోడ్లపైకి పూర్తి సామర్థ్యం ఉన్న వాహనాలు మాత్రమే తిరుగుతాయని.. దానివల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

  1. వాహన ఫిట్​నెస్​ టెస్ట్ అవసరమా? వాహనం ప్రయాణాలకు లోబడి ఉందా? వాహన సామర్థ్యం ఎలా ఉంది? వంటి విషయాలను రవాణా శాఖ తనిఖీ చేస్తుంది. దీని ద్వారా వాహన శక్తి సామర్థ్యాలు, వాహనం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అనే విషయాలు తెలుస్తాయి. వీటిని బేరీజు వేసిన తరువాత రవాణా శాఖ సర్టిఫికెట్​ జారీ చేస్తుంది. వాహనం రోడ్డుపై ప్రయాణించటానికి ఈ సర్టిఫికెట్​ తప్పనిసరి.
  2. కొత్తగా వచ్చిన తేడా ఏంటి? పాత పద్ధతి ప్రకారం రవాణా శాఖ అధికారులే వాహనాల ఫిట్​నెస్​ టెస్ట్ చేస్తున్నారు. దీని వల్ల కొన్ని పొరపాట్లు జరిగి, సామర్థ్యం లేని వాహనాలు రోడ్లపైకి వచ్చే ప్రమాదముంది. అందుకే ఆటోమేటెడ్​ టెస్టింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తోంది. అంటే.. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాలను వినియోగించి వాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది.
  3. అమలులోకి ఎప్పటి నుంచి? కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని దశల వారీగా ప్రవేశ పెడుతోంది. 2023 ఏప్రిల్​ 1 నుంచి మెుదటి దశలో భారీ సరకు రవాణా వాహనాలు, బస్సులు వంటి ప్రయాణ వాహనాలకు ఆటోమేటెడ్ ఫిట్​నెస్​ టెస్ట్​ను తప్పనిసరి చేసింది.
  4. పూర్తిస్థాయిలో అన్నివాహనాలకు అమలు ఎప్పుడు? మధ్యతరహా, చిన్న రవాణా వాహనాలకు కొంత వెసులుబాటును కల్పించింది కేంద్రం. ఈ వాహనాలకు 2024 జూన్ 1 నుంచి ఏటీఎస్​తో ఫిట్​నెస్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది.
  5. ఫిట్​నెస్​ టెస్ట్ ఎప్పుడు చేయించాలి? వ్యక్తిగత వాహనాలు కొని 15 సంవత్సరాలు గడిచాక రిజిస్ట్రేషన్​ను పునరుద్ధరించుకోవాలి. రిజిస్ట్రేషన్​ రెన్యూవల్​ సమయంలోనే ఫిట్​నెస్ టెస్ట్​ చేయించుకోవాలని రవాణా శాఖ తెలిపింది. కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. 8 ఏళ్లలోపు కమర్షియల్ వాహనాలకు రెండు సంవత్సరాల పరిమితితో రీరిజిస్ట్రేషన్ చేస్తారు. 8 సంవత్సరాలు దాటిన కమర్షియల్​ వాహనాలకు ఒక సంవత్సరం కాలపరిమితి పొడిగిస్తారు.

ఇవీ చదవండి..

Tata Neu App: పేమెంట్స్ నుంచి పర్చేజ్ దాకా.. సినిమాలూ.. ట్రావెలింగ్ అన్నీ ఒకే చోట.. టాటా సూపర్ యాప్

Income Tax: మన దేశంలో టాక్స్ కట్టని వారు ఎందరో తెలుసా? వారి బకాయిలు ఎన్ని లక్షల కోట్లంటే..