Azadi Ka Amrit Mahotsav: మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఈ ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్నాయి. ఈనేపథ్యంలో 75 ఏళ్ల స్వాత్రంత్ర్య వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ చేపడుతోంది. పౌరుల్లో దేశభక్తి పెంపొందేలా పలు అవగాహన కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) పేరుతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కో ఆపరేటివ్ సొసైటీలు ఇలా అన్నీ ప్రభుత్వ, ప్రభుత్వేయతర సంస్థలన్నీ ఈ క్యాంపెయిన్‌లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనల్లో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌కి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
ఇక ప్రజల్లో స్వాతంత్ర్య భావాన్ని నింపేలా అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, హోం పేజీల్లో మువ్వన్నెల జెండాను డిస్ ప్లే చేయాలని కోరారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహించే వారు భారత జెండాను డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టుకోవాలని సూచించారు. ఇక అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్, న్యూస్ వెబ్‌సైట్లలోనూ హర్ ఘర్ తిరంగా లోగోనూ ప్రదర్శించాలని సూచించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.