Bihar Election: వాటికి ఆధార్‌ సాక్ష్యం కాదు.. అప్పటికల్లా బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ జ్ఞానేష్ కుమార్

గెట్‌..సెట్‌...గో . బీహార్‌లో ఎన్నికల బెల్‌ మోగింది. నవంబర్ 22లోపు ముందే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలోనే తొలిసారిగా బ్యాలెట్‌పై అభ్యర్థుల కలర్‌ ఫోటోలను ముద్రించబోతున్నారు. పౌరసత్వం, డేటా ఆఫ్‌ బర్త్‌కు ఆధార్‌ సాక్ష్యం కాదని కీలక ప్రకటన చేసింది ఈసీ.

Bihar Election: వాటికి ఆధార్‌ సాక్ష్యం కాదు.. అప్పటికల్లా బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ జ్ఞానేష్ కుమార్
Cec Gyanesh Kumar

Updated on: Oct 05, 2025 | 8:33 PM

బిహార్‌ పోల్‌ దంగల్‌కు రంగం సిద్దమైంది.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సర్వం సిద్దమైంది. రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం బీహార్‌లో పర్యటించింది.ఒకట్రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని పొలిటికల్‌ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించాలని జేడీయూ కోరింది. ఐతే ఎన్ని దశల్లో పోలీంగ్‌ నిర్వహించాలనే అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌. నవంబర్‌ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బీహార్‌ ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. అనర్హులను ఓటర్లపై జాబితా నుంచి తొలగించామన్నారు సీఈసీ . బీహార్‌ ఓటర్లు ఆ జాబితాను స్వాగతించారన్నారు.

తుదిజాబితాపై రాజకీయాల పార్టీలకు ఏవైనా అభ్యంతరాలుంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. 12 వందల మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయింమన్నారు ఈసీ . తొలిసారి ఈవీఎం బ్యాలెట్‌ షీట్‌పై అభ్యర్థుల ఫోటోలు, ఎన్నికల గుర్తును కలర్‌ ఫోటోలతో పాటు, అభ్యర్థుల సీరియల్‌ నెంబర్లను పెద్దగా ముద్రిస్తామన్నారు. పౌరసత్వం, డేటా ఆఫ్‌ బర్త్‌కు ఆధార్‌ సాక్ష్యం కాదని సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు 17 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ఈ చర్యలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నమూనాలుగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. “బీహార్‌లో 17 కొత్త కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయబడ్డాయి.. కొన్ని ఎన్నికల నిర్వహణలో.. మరికొన్ని కౌంటింగ్‌లో అమలు చేయబడతాయి” అని CEC జ్ఞానేష్ కుమార్ అన్నారు.

కాగా.. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.2025 నవంబర్‌ 22తో ముగుస్తుంది .అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఈసీ. గతంలో బీహార్‌లో మూడు, ఐదు విడతల్లో పోలీంగ్‌ నిర్వహించిన సందర్భాలున్నాయి. ఒకే విడత పోలింగ్‌ జరపాలని జేడీయూ కోరగా.. రెండు, మూడు దశల్లో నిర్వహించాలని మిగతా పార్టీలు కోరాయి. ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది ఈసీ. బీహార్‌ ఎన్నికల పరిశీలకులుగా 470 మంది అబ్జర్వర్లను నియమించింది.అక్టోబర్‌ 28న ఛత్‌ పండగ ఉండటంతో.. అక్టోబర్‌ 31 తర్వాత తొలి దశ నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..