Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్.. నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది సీబీఐ స్పెషల్ కోర్టు. సీబీఐ ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిపింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్.. నిందితులకు  సీబీఐ ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్
Delhi Liquor Scam

Updated on: Jan 03, 2023 | 12:40 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ  మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఇందులో ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఇందులో మొత్తం ఏడుగురి నిందితులపై సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు బెయిల్ జారీ చేసింది.

ఈ కేసులో అభిషేక్ బోయిన్ పల్లి, విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా మిగతా వారిని మాత్రం అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం కోర్టు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా రెగ్యులర్ బెయిల్ కోసం మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం