ఆమెకు రక్షణ కల్పించండి, ముంబై పోలీసులకు సీబీఐ సూచన

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు సీబీఐ సూచించింది,  తాను గానీ, తన తండ్రి గానీ తన ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వఛ్చినా మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు తమను  చుట్టుముట్టి ఇబ్బంది కలిగిస్తున్నారని...

ఆమెకు రక్షణ కల్పించండి, ముంబై పోలీసులకు సీబీఐ సూచన

Edited By:

Updated on: Aug 29, 2020 | 2:45 PM

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు సీబీఐ సూచించింది,  తాను గానీ, తన తండ్రి గానీ తన ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వఛ్చినా మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు తమను  చుట్టుముట్టి ఇబ్బంది కలిగిస్తున్నారని రియా ఇటీవల ఫిర్యాదు చేసింది.  తన తండ్రిని ఇంటిలోకి రాకుండా అడ్డకుంటున్న మీడియావారి వీడియోను కూడా ఆమె విడుదల చేసింది. తమకు ప్రొటెక్షన్ కల్పించాలని అభ్యర్థించింది. దీంతో సీబీఐ ఈ మేరకు ముంబై పోలీసులను కోరింది. దర్యాప్తు కోసం రియాను ఎప్పుడు రావలసిందిగా కోరినా ఆమె వెంట పోలీసు భద్రత ఉండాలని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇలా ఉండగా.. శనివారం కూడా సీబీఐ ఆమెను ఇంటరాగేట్ చేసింది. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో, ఈడీ పలు దఫాలుగా ఆమెను విచారించాయి. అయితే వారి ప్రశ్నలకు ఆమె తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ వస్తోంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us