Kothapalli Geetha: బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష..

|

Sep 14, 2022 | 2:08 PM

బ్యాంక్ ఫ్రాడ్ కేసులో కొత్తపల్లి గీతను అదుపులోకి తీసుకుంది సీబీఐ. ఈ ఇష్యూపై గీత దంపతులపై చాలాక్రితమే సీబీఐ కేసు నమోదు చేసి.. ఛార్జ్‌షీట్ సైతం ఫైల్ చేసింది.

Kothapalli Geetha: బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష..
Kothapalli Geetha
Follow us on

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు హైదరాబాద్‌(Hyderabad)లో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్(punjab national bank) నుంచి 52 కోట్ల రూపాయల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించని నేపథ్యంలో గీత దంపతులపై సీబీఐ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు.. గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా  విధించింది. గీత భర్త పి.రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష ఫైన్ వేసింది. ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. విశ్వశ్వర ఇన్ ఫ్రా ప్రై.లి.కు రూ.2లక్షల జరిమానా విధించిన సీబీఐ కోర్టు. 2015లో నమోదైన కేసులో.. మంగళవారం తీర్పిచ్చింది న్యాయస్థానం. కొత్తపల్లి గీత సహా నిందితులను అదుపులోకి తీసుకుంది సీబీఐ. గీత భర్త, బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం వైద్యపరీక్షల కోసం గీతను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు గీత.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి