లక్నో, ఆగస్టు 11: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో గురువారం సాయంత్రం (ఆగస్టు 11) ఈ ఘటన దారుణ ఘటన చోటుచేసుకుంది. వాకింగ్‌కు వెళ్లిన బీజేపీ నేత అనూజ్ చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం పరారయ్యారు. నగరంలోని మజోలా ప్రాంతంలో శుక్రవారం (ఆగస్టు 11) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది.
బీజేపీ నేత అనూజ్ చౌదరి తన సోదరుడితో కలిసి గురువారం సాయంత్రం పార్కుకు వాకింగ్‌కు వెళ్లాడు. ఇంటి నుంచి బయలుదేరి బయటికి వెళ్లిన వీరిపై ముఖానికి మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి అకస్మిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చౌదరిపై దుండగులు పలుసార్లు కాల్పులు జరిపారు. కిందపడిపోగానే మరో రెండు సార్లు కాల్చి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను నగరంలోని బ్రైట్‌స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ కక్షల కారణంగానే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రత్యర్థులే హత్యకు పాల్పడ్డారని అనుజ్ చౌదరి కుటుంబం ఆరోపించింది.
#CCTVCamera footage of sensational murder of @BJP4UP functionary Anuj Chaudhary in #UP‘s #Moradabad. He was shot dead while he was on evening walk with his brother. @Uppolice have registered an FIR against three men.#UPPolice #YogiKaNayaUP pic.twitter.com/g8YFddawTu
— Sumedha Sharma (@sumedhasharma86) August 10, 2023
కాగా అనుజ్ చౌదరి స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 2021లో సంభాల్‌కు చెందిన అసమోలి నుంచి పోటీ చేశాడు. అయితే ఈ ఎన్నికల్లో అతను కేవలం 10 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్రస్తుతం అక్కడి అనూజ్ ప్రస్తుత బ్లాక్ చీఫ్ (అస్మోలీ) సంతోష్ దేవిపై అవిశ్వాస తీర్మానానికి అనుజ్ చౌదరి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో చౌదరి హత్య కావడం పలు వివాదాలకు దారితీస్తోంది. మృతుడు అనూజ్ చౌదరితో ప్రస్తుతం జైలులో ఉన్న మోహిత్ చౌదరి, అతని సోదరుడు అమిత్ చౌదరికి కూడా విభేదాలు ఉన్నాయి. ఇక సంతోష్ దేవి భర్త ప్రభాకర్, ఆమె కుమారుడు అనికేత్ చౌదరితో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనే చౌదరి తనకు ప్రాణహాని ఉందని పోలీసుల భద్రత కోరాడు. అయితే బీజేపీ అగ్రనేతలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పట్లో చౌదరికి భద్రత కల్పించారు. అయితే ఆ తర్వాత ప్రత్యర్థులతో అనూజ్‌కు రాజీ కుదరడంతో ఆ భద్రతను ఉపసంహరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.