చెన్నైలో కారు రేసింగ్స్..ఎస్..యూత్ రెచ్చిపోతున్నారు. నగర శివార్లలో రోడ్లపై విచ్చలవిడిగా కారు రేసింగ్స్ నిర్వహిస్తున్నారు. ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్తూ యాక్సిడెంట్స్ చేస్తున్నారు. యువకుల ర్యాష్ డ్రైవింగ్‌కు పలువురు బలవుతున్నారు. వరుసగా రెండ్రోజులుగా చెన్నైలో కార్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న ఓ కారు అడయార్‌లో విధ్వంసం సృష్టించింది. ఇక ఇవాళ అన్నానగర్‌లోని సూపర్ మార్కెట్‌లోకి దూసుకెళ్లింది ఓ కారు. ఒక్కసారిగా కారు మీదికి రావడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. యాక్సిడెంట్ చేసిన యువకులు పరారయ్యారు.
ఇక నిన్న అడయార్‌లో ఫుల్లుగా మందు కొట్టి స్టీరింగ్ పట్టారు. నిషా నెత్తికెక్కి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. పైగా ఓవర్ స్పీడ్..ఇంకేముంది. జనం పైకి దూసుకెళ్లింది కారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..తీవ్రగాయాలతో మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. కారులోని ఓ వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. మరొకరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: మూడు రాష్ట్రాల పోలింగ్ అప్ డేట్స్ ఇక్కడ చూడండి
High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..