Cancel SSc And HSC Exam in Maharashtra : మహారాష్ట్రలో కరోనా భయంకరమైన పరిస్థితి కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు పది, పన్నెండు తరగతుల పరీక్షలను నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం విద్యార్థుల పేరేంట్స్ సంఘాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసాయి. అయితే ఇందులో మోదీ జోక్యం చేసుకొని 10,12 తరగతి విద్యార్థులకు ఉపశమనం ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇండియా వైడ్ పేరెంట్స్ అసోసియేషన్ ఈ లేఖను ప్రధాని మోదీకి పంపాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా స్థితిని పరిగణనలోకి తీసుకొని 10, 12 తరగతులతో పాటు విశ్వవిద్యాలయాల్లో పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే విధానాన్ని ప్రకటించాలని పేర్కొన్నారు.
కొరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిఎస్సి ఎగ్జామ్) నిర్వహించే ఉమ్మడి పరీక్షను రద్దు చేసింది. ఆ తరువాత ఏప్రిల్ చివరి నుంచి ప్రారంభమయ్యే 10వ -12 పరీక్షల గురించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. పరీక్షలు రద్దు చేయకపోతే కనీసం ఆన్‌లైన్‌లోనైనా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా మంత్రి వర్షా గైక్వాడ్ ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పెరుగుతున్న కరోనా రోగుల నేపథ్యంలో రాష్ట్రంలో కఠినమైన ఆంక్షలు విధించారు. ఫలితంగా10 వ -12 తరగతి పరీక్షను ఎలా నిర్వహించాలో చాలామంది ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షా గైక్వాడ్ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖకు చెందిన అధికారులు పాల్గొంటారు.
1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేశారు.10,12 తరగతుల విద్యార్థులకు కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అయితే పదో తరగతి రాత పరీక్ష ఏప్రిల్ 29 మే 20 మధ్య జరుగుతుంది. పన్నెండో తరగతి రాత పరీక్ష ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకు జరుగుతుంది.10, 12 పరీక్షలను స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, పూణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్, ముంబై, కొల్హాపూర్, అమరావతి, నాసిక్, లాటూర్ కొంకణాలు నిర్వహిస్తున్నాయి.