Cable Bridge Collapse Updates: కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘనటలో 91కి చేరిన మృతుల సంఖ్య

|

Oct 31, 2022 | 5:27 AM

గుజరాత్‌లో కూలిపోయిన కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కేబుల్‌ బ్రిడ్జి కూలిపోవడంతో మృతుల సంఖ్య 91కి చేరింది. చాలా మంది తీవ్రంగా..

Cable Bridge Collapse Updates: కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘనటలో 91కి చేరిన మృతుల సంఖ్య
Cable Bridge Collapse Updates
Follow us on

గుజరాత్‌లో కూలిపోయిన కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కేబుల్‌ బ్రిడ్జి కూలిపోవడంతో మృతుల సంఖ్య 91కి చేరింది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు, వృద్ధులే ఉన్నారు. మచ్చు నదిపై కొత్తగా నిర్మించిన ఈ కేబుల్ వంతెనను మూడు రోజుల క్రితం ప్రారంభించారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగింది. ఆ సమయంలో వంతెనపై 500 మంది ఉన్నారు. అందరూ ఛత్ పండుగను జరుపుకుంటుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 400 మంది గల్లంతు కాగా, రెస్య్కూటీమ్‌ రంగంలోకి దిగా 200 మంది వరకు కాపాడారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలను పంపించారు. దీనితో పాటు, గుజరాత్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ 02822-243300 ను కూడా జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే, గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి బ్రిజేష్ మెర్జా ఘనటనపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. అయితే మృతుల్లో 25 మందికి పైగా చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌-ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు అనేక బృందాలు రెస్క్యూ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న భారత నావికాదళానికి చెందిన 50 మంది సిబ్బందితో ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 3 స్క్వాడ్‌లు, 30 మంది ఐఎఎఫ్ సిబ్బందితో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం ఆర్మీకి చెందిన 3 స్క్వాడ్‌లు, రాజ్‌కోట్, జామ్‌నగర్, డయ్యూ, సురేంద్రనగర్‌ల నుండి అధునాతన పరికరాలతో 7 అగ్నిమాపక దళ బృందాలు మోర్బికి బయలుదేరాయని గుజరాత్ సీఎం వెల్లడించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసుల స్క్వాడ్‌లు కూడా రెస్క్యూ ఈ సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి.

ఇవి కూడా చదవండి

 

మోర్బీ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న గుజరాత్ సీఎం

మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో గాయపడిన రోగులను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మోర్బీ సివిల్ ఆస్పత్రికి చేరుకుని రోగులను క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం