Building Collapsed: హమ్మయ్య.. అంతా సేఫ్.. ఇలా బయటకు వచ్చారో లేదో కూలింది..

టెక్‌సిటీ బెంగళూర్‌లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే ఈ భవనం నేల కూలింది. భవనం కూలుతున్న దృశ్యాలను..

Building Collapsed: హమ్మయ్య.. అంతా సేఫ్.. ఇలా బయటకు వచ్చారో లేదో కూలింది..
Building Collapsed

Updated on: Sep 27, 2021 | 3:19 PM

టెక్‌సిటీ బెంగళూర్‌లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే ఈ భవనం నేల కూలింది. భవనం కూలుతున్న దృశ్యాలను స్థానికుల కెమెరాల్లో చిక్కింది. ఈ ఘటన బెంగళూర్‌ లోని విల్సన్‌ గార్డెన్‌ ప్రాంతంలో జరిగింది. భవనం కూలడానికి ముందే జనాన్ని అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంధి పరిస్థితిని సమీక్షించి.. సహాయక చర్యలు చేపట్టింది.

గత మూడు రోజులుగా ఈ భవనం కుంగిపోతున్నట్లు అధికారులు ముందే గుర్తించారు. దీంతో ఆ భవనంలో ఉన్న వాళ్లను మూడు రోజుల క్రితమే అక్కడి నుంచి మరో భవనంలోకి మార్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు తగులలేదని అధికారులు వెల్లడించారు.