MLC Kavitha: ఈడీ విచారణకు హాజరవుతా.. సస్పెన్స్‌కు తెర తీసిన ఎమ్మెల్సీ కవిత.

| Edited By: Narender Vaitla

Mar 20, 2023 | 9:32 AM

ఈడీ విచారణకు కవిత హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. హాజరుపై రాత్రి నుంచి న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం విచారణకు వెళ్లాలని నిర్ణయం..

MLC Kavitha: ఈడీ విచారణకు హాజరవుతా.. సస్పెన్స్‌కు తెర తీసిన ఎమ్మెల్సీ కవిత.
MLC Kavitha,
Follow us on

ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్‌కు తెరదించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ విచారణకు కవిత హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. హాజరుపై రాత్రి నుంచి న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం విచారణకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఉదయం 11 గం.లకు ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు. కవితతో పాటే నివాసంలో మంత్రి కేటీఆర్‌, సంతోష్‌ సహా ఇతర నేతలు ఉన్నారు. ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసం, ఈడీ ఆఫీస్‌ ఎదుట భారీగా పోలీసుల మోహరించారు.

వాదనలు వినకుండా, ముందస్తు ఆదేశాలు జారీ చేయొద్దంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈడీ కేవియట్ పిటీషన్‌ వేశారు. ఇవాళ్టితో ముగియనున్న రామచంద్రపిళ్లై కస్టడీ. కవిత ఈడీ విచారణకు హాజరైతే పిళ్లైతో కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను వెళ్లకుండా మళ్లీ న్యాయవాదులనే పంపే చాన్స్‌ కూడా ఉందంటున్నారు.

ఇదిలావుంటే, బేగంపేట నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. వెంట మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారించాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ, కోర్టు వాయిదాలు.. నిందితుల కస్డడీ ఇలా చాలా పరిణామాలు కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి హాజరుకావాలని ఆదేశించారు.

అయితే ఢిల్లీ వెళ్లిన కవిత విచారణకు మాత్రం హాజరుకాలేదు. తన ప్రతినిధిగా సోమ భరత్ కుమార్‌ను ఈడీ కోరిన బ్యాంకు స్టేట్‌మెట్లు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించారు. విచారణకు హాజరుకానప్పటికీ దాన్ని గైర్హజరుగా పరిగణించలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. 20న విచారణకు రావాలని సూచించింది.

ఈడీ జారీ చేసిన నోటీసుల్లో ఈసారి వ్యక్తిగతంగా అన్న పదాన్ని ప్రస్తావించారని.. ఈ పరిస్థితుల్లో కవిత ఇవాళ విచారణను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. విచారణలో భాగంగా కవితను తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో పాటుగా ప్రశ్నించాలని భావిస్తోంది. అయితే కవిత విచారణపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం