CM KCR Maharashtra Visit: జాతీయ రాజకీయాలవైపు చేస్తున్న ప్రయాణంలో వేగం పెంచిన కేసీఆర్.. మహారాష్ట్రపై ఎక్కువ దృష్టిసారించినట్టు కనిపిస్తోంది. ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు ఆయన మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్లనుకున్న కేసీఆర్‌ను.. భారీ కాన్వాయ్ ఫాలో కాబోతోంది. కేసీఆర్‌తో పార్టీ ముఖ్యనేతలు మాత్రమే కాదు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ జిల్లా స్థాయి నేతలు కూడా బయల్దేరి వెళ్తున్నారు. పూర్తిగా రోడ్డు మార్గంలోనే సాగనున్న ఈ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు బీఆర్‌ఎస్ నేతలు. హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్‌కు ఇవాళ సాయంత్రం వరకు చేరుకునేలా చేరుకునేలా ప్లాన్ చేశారు.
షోలాపూర్‌లో పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకోన్నారు. స్థానిక నాయకుడు భగీరథ్ బాల్కే.. కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. షోలాపూర్ చేనేత కార్మికులతోనూ కేసీఆర్ కలవనున్నారు. రాత్రికి షోలాపూర్‌లోనే బస చేయనున్న ముఖ్యమంత్రి.. రేపు ఉదయం పండరీపూర్ చేరుకుంటారు. విఠలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ దారాశివ్ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్ నాగ్‌పూర్‌లో ఇటీవలే పార్టీ ఆఫీస్‌ను కూడా ప్రారంభించుకుంది. తాజాగా కేసీఆర్ రెండ్రోజుల పర్యటనలో ఆధ్యాత్మిక కోణమే కనిపిస్తున్నా.. విరామ సమయాల్లో జరిగే రాజకీయ మీటింగులు, చర్చలు మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌కు మరింత బలాన్నిస్తుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతేకాకుండా పలువురు మహారాష్ట్ర నేతలు కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు.
ఈ సమయంలోనే.. తెలంగాణ సరిహద్దున్న జిల్లాల్లో పార్టీ విస్తరణ, అర్బన్ ఎరియాల్లో పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై కూడా అక్కడున్న నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనప్పటికీ.. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన.. అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..