Corona Mask: కరోనా నిబంధనలు పాటించని వారిపై అధికారుల కొరఢా.. మాస్కు ధరించని వారి నుంచి రూ. 30 కోట్ల ఆదాయం

|

Feb 25, 2021 | 1:39 AM

Corona Mask: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల్లో భాగంగా చాలా వరకు పాజిటివ్‌ కేసులు తగ్గిపోయాయి. ఇక ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం...

Corona Mask: కరోనా నిబంధనలు పాటించని వారిపై అధికారుల కొరఢా.. మాస్కు ధరించని వారి నుంచి రూ. 30 కోట్ల ఆదాయం
Follow us on

Corona Mask: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల్లో భాగంగా చాలా వరకు పాజిటివ్‌ కేసులు తగ్గిపోయాయి. ఇక ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తప్పని సరి అయిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే మాస్కు ధరించకుంటే భారీగా జరిమానా విధిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఉంది. మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. ఆ మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరికి మాస్కు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మాస్కులేని వారికి జరిమనా విధిస్తున్నారు. కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) నిన్న ఒక్క రోజులోనే ముంబై నగరంలో జరిమానాల రూపంలో రూ.29 లక్షల వసూలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని రూ.14,600 మంది నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మొత్తం 22,976 మంది నుంచి 45.95 లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబైలో తీవ్రంగా ఉన్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి బీఎంసీ కమిషనర్‌ ఐఎస్‌ చాహల్‌ కఠినమైన చర్యలు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం వసూలు చేయడం గమనార్హం. బీఎంసీ తాజా మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తున్నారు. ఇక 2020 ఏడాది మొత్తం మీద మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా రూ. 30 కోట్ల 50 లక్షల వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది.

మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ముంబై పోలీసు, సెంట్రల్‌, వెస్టన్‌ రైల్వే వంటి వివిధ ఏజన్సీలు మాస్క్‌ ధరించని వారి నుంచి వసూలు చేసిన జరిమానాల మొత్తానికి సంబంధించిన డాటాను బీఎంసీ విడుదల చేయడం ప్రారంభించింది. సబర్బన్‌ రైల్వే నెట్‌ వర్క్‌ను నడుపుతున్న సెంట్రల్‌, వెస్టన్‌ రైల్వేలు ఇప్పటి వరకూ రూ.91,800 జరిమానాగా వసూలు చేసినట్లు ముంబై అధికారులు వెల్లడించారు. బీఎంసీ గణాంకాల ప్రకారం.. సంస్థ ప్రతి రోజు మాస్క్‌ ధరించని సుమారు 13,000 మంది నుంచి రోజుకు సగటున 25 లక్షల రూపాయలకుపైగా వసూలు చేస్తోంది. జరిమానా కట్టలేని వారితో వీధులు ఉడ్చడం వంటి పనులు చేయిస్తోంది. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని గతవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తాజా ఆంక్షలను ప్రకటించారు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అని నిర్ణయించడానికి వచ్చే ఎనిమిది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు.

Also Read:

Covid-19: ఆ రాష్ట్రాల వారు వస్తే కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి.. ఢిల్లీ, బెంగాల్‌ ప్రభుత్వాలు కీలక నిర్ణయం

Coronavirus: ఆ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 9 వేలకు చేరిన రోజువారీ కేసుల సంఖ్య