Shocking: ఎటు పోతోంది సమాజం.. కన్యత్వ పరీక్షలో విఫలమైన వధువు.. గ్రామ పెద్దలు ఏం తీర్పు ఇచ్చారో తెలిస్తే షాకే..

ఈ ప్రాంతంలో వివాహం తర్వాత నవ వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం ఇంకా కొనసాగుతోంది. ఈ దురాఘతాన్ని కుకుడీ అంటారు. అయితే..

Shocking: ఎటు పోతోంది సమాజం.. కన్యత్వ పరీక్షలో విఫలమైన వధువు.. గ్రామ పెద్దలు ఏం తీర్పు ఇచ్చారో తెలిస్తే షాకే..
Bride

Updated on: Sep 06, 2022 | 10:45 AM

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్యత్వ పరీక్షలో విఫలమైందని ఓ నవ వధువును అత్తింటివారు దారుణంగా కొట్టారు. ఆపై ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా చివరికి పంచాయితీ నిర్వహించి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన మేవార్‌ ప్రాంతంలోని బిల్వారా జిల్లా బాగోర్‌లో జరిగింది. ఈ ప్రాంతంలో వివాహం తర్వాత నవ వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం ఇంకా కొనసాగుతోంది. ఈ దురాఘతాన్ని కుకుడీ అంటారు. అయితే.. ఈ ఏడాది మే 11న భిల్వారా నగరానికి చెందిన 24 ఏళ్ల యువతికి, భాగోర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహం తర్వాత వారి ఆచారమైన కుక్డి విధానంలో వధువుకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో అత్తింటివారు ఆమె తీవ్రంగా కొట్టి.. పుట్టింటికి వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా మే 31న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ పంచాయితీలో బాధిత మహిళ.. పెళ్లి కాక ముందు తనపై పొరుగింటి యువకుడు అత్యాచారం చేశాడని వెల్లడించింది. ఈ సంఘటనపై తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పెద్దల ముందు మొరపెట్టుకుంది. అయినప్పటికీ.. పెద్దలు ఆమెను, ఆమె కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. బాధిత మహిళ కుటుంబం.. వరుడి కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సిందేనని పెద్దలు తీర్పు ఇచ్చారు.

అయితే.. జరిమానా చెల్లించకపోవడంతో.. ఐదు నెలలుగా యువతిని అత్తమామలు వేధిస్తున్నారు. చివరకు వారి వేధింపులకు విసిగిపోయిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు బాగోర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు భర్త, అత్తమామపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో నిజమేనని తేలిందని దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..