Indian Navy: ఇండియన్ నేవీలోకి బ్రహ్మోస్ క్షిపణలు.. రక్షణ శాఖకు నేవీ ప్రతిపాదనలు..

|

Dec 16, 2020 | 3:02 PM

భారత నావికాదళం మరింత శక్తవంతం కానుంది. నావికాదళ అమ్ములపొదిలోకి శక్తివంతమైన అస్త్రాల వచ్చి చేరనున్నాయి. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను

Indian Navy: ఇండియన్ నేవీలోకి బ్రహ్మోస్ క్షిపణలు.. రక్షణ శాఖకు నేవీ ప్రతిపాదనలు..
Follow us on

భారత నావికాదళం మరింత శక్తవంతం కానుంది. నావికాదళ అమ్ములపొదిలోకి శక్తివంతమైన అస్త్రాల వచ్చి చేరనున్నాయి. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే 38 బ్రహ్మోస్ క్షిపణులను యుద్ధ నౌకల్లో మోహరించాలని ఇండియన్ నేవి నిర్ణయించింది. విశాఖలో తయారవుతున్న యుద్ధ నౌకల్లో వీటిని వినియోగించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం రూ. 1800 కోట్లు ఖర్చు అవుతుందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ శాఖకు నేవీ పంపించింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఐఎన్ఎస్ చైన్నై నుంచి బ్రహ్మో క్షిపణులను నేవి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాతో వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. భాతర త్రివిధ దళాలను మరింత పటిష్ట పరుస్తోంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున రక్షణ పరికరాలను విదేశాల నుండి కొనుగోలు చేస్తోంది. దేశీయంగానూ అధునాతన ఆయుధాలను తయారు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. శక్తివంతమైన క్షిపణులను ప్రయోగిస్తోంది.

Also read:

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయమై హై కోర్టు కీలక వ్యాఖ్యలు.. కేంద్ర హోం శాఖ తీరుపై ఆగ్రహం

ప్రకాశంజిల్లా వాడరేవు, కటారివారిపాలెం మత్స్యకారుల ఘర్షణల నడుమ నలిగిపోతోన్న 75 గ్రామాల ప్రజలు