AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే మీరు నన్ను ఏడిపించారు.. ఆనంద్ మహీంద్రా ఉద్వేగపూరిత ట్వీట్.. వీడియో వైరల్..

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతా యాక్టీవ్‏గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన ప్రతి విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటేనే ఉంటారు.

ఉదయాన్నే మీరు నన్ను ఏడిపించారు.. ఆనంద్ మహీంద్రా ఉద్వేగపూరిత ట్వీట్.. వీడియో వైరల్..
Rajitha Chanti
|

Updated on: Dec 16, 2020 | 2:53 PM

Share

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతా యాక్టీవ్‏గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన ప్రతి విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటేనే ఉంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఉద్యేగపూరితమైన ట్వీట్ చేసారు ఆనంద్ మహీంద్రా. ప్రస్తుతం క్రిస్‏మస్ పండుగ దగ్గరికి వస్తున్న వేళ మహీంద్రా అందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో మొదటగా ఒక తాతా వయసున్న వ్యక్తి కనిపిస్తాడు. అతడు రోజు ఒక ఫోటోను ఎదురుగా పెట్టుకొని చాలా బరువున్న ఇనుప బంతిని ఎత్తెందుకు ప్రయాత్నం చేస్తూ ఉంటాడు. తన చుట్టు పక్కల ఉన్నవారు ఇతను ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాడు అని అనుమానంగా చూస్తూ ఉంటారు. మొదట్లో ఆ ఇనుప బంతిని ఎత్తడానికి ప్రయాత్నించి ఓడిపోతాడు. తర్వాత క్రమంగా సాధన చేస్తూ చివరికి ఆ బంతిని ఎత్తేస్తాడు. అయితే క్రిస్‏మస్ రోజు అందంగా తయారు అయ్యి ఒక బహుమతి తీసుకోని ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక చిన్నారి ఆ తాతా దగ్గరకు అప్యాయంగా వస్తుంది. తాను తీసుకువచ్చిన బహుమతిని తన మనువరాలికి ఇవ్వగా అందులో ఒక స్టార్ ఉంటుంది. అది చూడగానే ఆ చిన్నారి ఎంత సంతోషపడిపోతుంది. తర్వాత తన మనువరాలి చేతికి ఆ స్టార్ ఇచ్చి ఆమెను పైకి ఎత్తుకొని క్రిస్‍మస్ ట్రీ పైభాగంలో పెట్టిస్తాడు. తన మనవరాలిని ఎత్తుకోవడం కోసమే ఆ తాత అంత కష్టపడ్డాడని తన ముందు పెట్టుకున్న ఆ ఫోటో ఆ చిన్నారిదే అని కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ వీడియో ఆనంద్ మహీంద్రా కంటపడడంతో..” ఈరోజు ఉదయం లేవగానే మీరు నన్ను ఏడిపించారు. నాకు మనవరాలు లేదు.. కానీ ఆ వయసున్న మనవడు ఉన్నాడు అనే క్యాప్షన్‏తో ఆ వీడియోను షేర్ చేసాడు.

ఈ రెండు నిమిషాల వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయగానే ఒక్క గంటలో 20 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియో మా మనసులను హత్తుకుంది. మాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. హ్యప్పీ క్రిస్‏మస్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
చేపలు పడుతుండగా వ్యక్తికి ఊహించని షాక్.. నీటి లోపల నుంచి..
చేపలు పడుతుండగా వ్యక్తికి ఊహించని షాక్.. నీటి లోపల నుంచి..