వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయమై హై కోర్టు కీలక వ్యాఖ్యలు.. కేంద్ర హోం శాఖ తీరుపై ఆగ్రహం

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం విషయమై ఇవాళ హై కోర్టు సీరియస్ అయింది. ఈ కేసుకు..

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయమై హై కోర్టు కీలక వ్యాఖ్యలు..  కేంద్ర హోం శాఖ తీరుపై ఆగ్రహం
Follow us

|

Updated on: Dec 16, 2020 | 2:08 PM

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం విషయమై ఇవాళ హై కోర్టు సీరియస్ అయింది. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ కాకుండా, కేవలం మెమో దాఖలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. కేంద్ర హోం శాఖ తీరుని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేక పోతే ఎందుకు మీ హోదాలు అని ప్రశ్నించింది. ఫిబ్రవరి 2020 లో చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్ళీ కేంద్ర హోంశాఖ ఇవ్వడం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో మారు అవకాశం ఇస్తున్నాం.. జర్మన్ ఎంబసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోం శాఖ కు సూచించింది. ఇలాఉండగా, చెన్నమనేని రమష్ పౌరసత్వం పై ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని నవంబర్ 18 న కేంద్ర హోం శాఖను హైకోర్టు ఆదేశించినప్పటికీ ఏమాత్రం పురోగతి లేకపోవడంతో హై కోర్ట్ ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసింది.  వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయంలో ఇంకా తెగని వివాదం.. రేపటి వాదనలపై ఉత్కంఠ