Hot Weather: వేసవి ఎండలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.. రబీ పంటలు, రుతుపవనాలు, విపత్తులను ఎదుర్కోవడంపై చర్చ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం (మార్చి 06) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న నెలరోజుల్లో తీవ్ర వేడిమిపై చర్చించారు.

Hot Weather: వేసవి ఎండలపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష.. రబీ పంటలు, రుతుపవనాలు, విపత్తులను ఎదుర్కోవడంపై చర్చ
Hot Weather

Updated on: Mar 06, 2023 | 9:31 PM

రాబోయే నెలల్లో తీవ్రమైన అవకాశం ఉన్న దృష్ట్యా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (06 మార్చి) ఇవాళ సమావేశం నిర్వహించారు. కేబినెట్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రుతుపవనాలు, గోధుమలు, ఇతర రబీ పంటలపై వాతావరణం ప్రభావం, ఇతర అంశాలపై సమావేశంలో ప్రధానికి వివరించారు. అదే సమయంలో, వేసవిలో అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఆసుపత్రులలో ఫైర్ ఆడిట్ చేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు.

ఇది కాకుండా, రోజువారీ వాతావరణ సూచనలను సులభంగా అర్థం చేసుకోవడానికి.. వ్యాప్తి చేయడానికి వీలుగా జారీ చేయాలని వాతావరణ శాఖను పీఎం మోదీ సూచించినట్లుగా పీఎంఓ సమాచారం. టీవీ న్యూస్ ఛానెల్‌లు, ఎఫ్‌ఎం రేడియోలు రోజువారీ వాతావరణ సూచనలను వివరించడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు వెచ్చించాలని ప్రధాని సూచించినట్లుగా సమాచారం.

సాగునీటి సరఫరా, పశుగ్రాసం, తాగునీటిని పర్యవేక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా సమావేశంలో సమీక్షించినట్లుగా పీఎంవో తెలిపింది. అదనంగా, అవసరమైన సామాగ్రి లభ్యత, అత్యవసర పరిస్థితులకు సంసిద్ధత పరంగా రాష్ట్రాల సంసిద్ధత, ఆసుపత్రి మౌలిక సదుపాయాల గురించి ప్రధాన మంత్రికి వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం