‘నేను లైట్ గా చరిచింది మా ఇంటి కుర్రాడిలాంటి వాడ్నే’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీ.కె.శివకుమార్

పార్టీ కార్కర్తలతో తాను నడుస్తుండగా తన వెనుకే వస్తున్న ఓ వ్యక్తిని లైట్ గా కొట్టడాన్ని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీ.కె.శివకుమార్ తేలిగ్గా తీసుకున్నారు.

నేను లైట్ గా చరిచింది మా ఇంటి కుర్రాడిలాంటి వాడ్నే.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీ.కె.శివకుమార్
Dk Shivakumar

Edited By:

Updated on: Jul 11, 2021 | 6:37 PM

పార్టీ కార్కర్తలతో తాను నడుస్తుండగా తన వెనుకే వస్తున్న ఓ వ్యక్తిని లైట్ గా కొట్టడాన్ని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీ.కె.శివకుమార్ తేలిగ్గా తీసుకున్నారు. మాండ్యా జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వ్యక్తి తమ ఇంటి కుర్రాడిలాంటి వాడేనని ఆయన చెప్పారు.ఆ వ్యక్తి సారీ అన్నా అని చెబుతున్నా శివకుమార్ కూల్ కాలేదు. దీనిపై ఆయనను ప్రశ్నించినప్పుడు.. ఎంత పార్టీ కార్యకర్త అయినా ఒకరి నడుము చుట్టూ చెయ్యి వెయ్యబోతే ఎలా ఉంటుందని, ప్రజలు ఏమంటారని అన్నారు. ఆ వ్యక్తి కార్యకర్త అయినంత మాత్రాన ఇలాంటివాటిని అనుమతించాలా అని ప్రశ్నించారు. అయితే ఇదే సమయంలో ఆ వ్యక్తి తమ ఇంటి అబ్బాయి లాంటివాడేనని, దూరపు బంధువని, ఒకసారి అతడు తనను తిడితే తాను వింటానని, తను దూషిస్తే అతడు వింటాడని కూడా అన్నారు. ఇది మా ఇద్దరి మధ్య ఉన్నదే అని చమత్కరించారు.

ఏమైనా ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు నేరుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలకు దిగారు.హింసకు పాల్పడాలని మీరు శివకుమార్ కి లైసెన్స్ ఇచ్చారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి. రవి .ఆయనను ప్రశ్నిచారు. 1970-1980 నాటి బెంగుళూరు గ్యాంగ్ స్టర్ కొత్వాల్ రామచంద్ర సహచరుడిగా శివకుమార్ ను ఆయన పోల్చారు.

మరో ఘటనలో తనతో సెల్ఫీ దిగడానికి యత్నించిన ఓ వ్యక్తిపై శివకుమార్ చెయ్యి చేసుకున్న ఘటన తాలూకు వీడియోను కూడా బీజేపీ నేతలు పోస్ట్ చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Theaters Reopen: ఏదేమైనా ఈ నెలాఖరుకల్లా థియేటర్లు ఓపెన్‌ చేస్తాం.. స్పష్టం చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్‌..

రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ లకు బీజేపీలో సంస్థాగత పదవులు..? ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వ్యూహకర్తలు ..?