భారత్.. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం.. ఎప్పుడూ బీఎస్ఎఫ్ దళాలు గస్తీలో ఉంటాయి.. చీమ చిటుక్కుమన్నా.. కొంచెం అనుమానం వచ్చినా భద్రతా దళాలు అప్రమత్తమవుతాయి.. అలాంటి సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్ జరుగుతందని సమాచారం అందడంతో.. సైన్యం అప్రమత్తమైంది.. సరిగ్గా అర్దరాత్రి ఇద్దరు వ్యక్తులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిని వారిని బీఎస్ఎఫ్ దళం అడ్డుకుంది. వారిపై కాల్పులు జరపగా.. వారిద్దరూ తప్పించుకున్నారు. ఈ క్రమంలో వారు జారవిడిచిన చిన్న కూజా లాంటి బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అది ఎంటా అని చూడగా.. దెబ్బకు షాక్ అయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్మగ్లర్లు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి.. అక్రమంగా రవాణా చేయాలనుకున్న రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ వెల్లడించింది.
బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని హిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోష్‌పూర్ బీఓపీ ప్రాంతంలో.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత.. సుమారు 12.30 గంటల ప్రాంతంలో ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. వారిపై సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే, ఓ సిసాను స్మగ్లర్లు వదిలిపెట్టి పోగా.. దానిని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో పాము విషం ఉండటాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆ సీసాపై రెడ్ డ్రాగన్ కో ‘మేడ్ ఇన్ ఫ్రాన్స్’ అని రాసి ఉందని.. బాటిల్‌లో ఉన్న విషం కోబ్రా పాముదని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హిలి ప్రాంతంలో BSF 137వ బెటాలియన్ స్వాధీనం చేసుకున్న రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని బలుఘాట్ అటవీ శాఖకు అప్పగించినట్లు రేంజర్ సుకాంత్ ఓజాన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..