AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్‌.. వారికి బుద్ధి చెప్పేలా కొత్త నిబంధనలు

దేశంలో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికులు వణికిపోయారు. బాంబు బెదిరింపులకు పాల్పడ్డ ఆకతాయిల ఆటకట్టించేందుకు కేంద్రపౌరవిమానయాన శాఖ కఠిన నిబంధనలు తేనుంది.

వరుస బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్‌.. వారికి బుద్ధి చెప్పేలా కొత్త నిబంధనలు
An Indigo Aircraft
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2024 | 9:32 PM

Share

బాంబు పెట్టాం.. పేల్చిపారేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి..! అంటూ ఒక అజ్ఞాతవాసి నుంచి బెదిరింపు స్వరం. తీరాచూస్తే అంతా తూచ్‌. ఇదీ వరస. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్లన్న తేడా లేదు. ఉత్తుత్తి బెదిరింపులతో వేలాదిమంది ప్యాసింజర్లు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు గుప్పిట పట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి. అటు.. ఏవియేషన్ యంత్రాంగానిక్కూడా చుక్కలు కనిపించాయి.

గత మూడు రోజుల్లోనే మొత్తం 15 బాంబ్ థ్రెట్స్ నమోదయ్యాయి. అక్టోబర్ 16, బుధవారం.. ఈ ఒక్కరోజులోనే ఆరు విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయి. కాకపోతే అన్నీ ఫేకే..! అందరూ క్షేమం. మూడు ఇండిగో, రెండు స్పైస్‌జెట్.. ఒకటి ఆకాశ ఎయిర్.. మొత్తం ఆరు ప్లేన్లలో ప్రయాణికుల్ని బెంబేలెత్తించాయి బోగస్ ఫోన్‌కాల్స్‌.

ఢిల్లీ నుంచి చికాగో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అగంతకుల బెదిరింపు కారణంగా దారిమళ్లించాల్సి వచ్చింది. సీక్రెట్‌గా ఒక రిమోట్ ఎయిర్‌పోర్ట్‌లో దింపి.. అందులోని 200 మంది ప్రయాణికుల్ని కాపాడారు. వీళ్లను ఎయిర్‌లిఫ్ట్ చేయడం కోసం.. రాయల్ కెనడియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన CC-330 యుద్ధ విమానాన్ని వాడారు.

ఇటీవలే తిరుపతి విమానాశ్రయానికే బెదిరింపు లేఖ వచ్చింది. ఈ-మెయిల్‌ ద్వారా CISF‌ అధికార వెబ్‌సైట్‌కు పంపిన లేఖను గోప్యంగా ఉంచింది ఎయిర్‌పోర్టు అథారిటీ. పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ-మెయిల్‌ ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం జరుగుతోంది.

ఒకవైపు ప్యాసింజర్లకు అసౌకర్యం.. మరోవైపు ఫ్లయిట్ షెడ్యూల్స్ మార్చాల్సి రావడం..! ఫేక్ కాల్స్‌తో ఈ హైరానా పడలేకున్నాం అంటూ ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతోంది. అందుకే.. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. ప్లస్ హోమ్ మినిస్ట్రీ.. కలిసి కూర్చుని.. హైలెవల్ మీటింగ్ పెట్టుకుని.. వాట్‌టు డూ.. వాట్‌నాట్ టూడూ అని చర్చించాయి. అగంతకుల్ని పసిగట్టి.. వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిసైడయ్యాయి.

ఫేక్‌ గాళ్లందరికీ అడ్డా సోషల్ మీడియానే. ఎక్కువగా ట్వీట్ల ద్వారానే అగంతకులు ఓవరాక్షన్‌కు పాల్పడుతున్నట్టు తేలింది. వీలైతే వీళ్లను మళ్లీ విమానమెక్కనివ్వకుండా నో-ఫ్లై లిస్టులో చేర్చాలని, ఆర్థికంగా నష్టపోయిన విమానయాన సంస్థలకు వాళ్లతోనే పరిహారం ఇప్పించాలని..  ఐదేళ్ల జైలు శిక్ష వేయాలని ప్రపోజల్స్ వస్తున్నాయి.  ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం, 1934 సబార్డినేట్ చట్టాలకు సవరణలు చేసేందుకు కేంద్రంలోని ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి న్యాయనిపుణులతో మాట్లాడి లీగల్‌ ఒపీనియన్ తీసుకుంటోంది కేంద్ర సర్కార్. అటు.. వరుస బెదిరింపుల వెనక ఏదైనా విదేశీ హస్తం ఉందా అనే అనుమానాల్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..