Delhi: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది

|

May 12, 2024 | 8:19 PM

లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఢిల్లీలో బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం, ఢిల్లీలోని చాలా పెద్ద పాఠశాలలకు బాంబు బెదిరింపులతో కూడిన ఇమెయిల్‌లు వచ్చాయి. అదే సమయంలో, ఆదివారం (మే 12) ఢిల్లీలోని రెండు ఆసుపత్రుల తర్వాత, ఇప్పుడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)కి బాంబు బెదిరింపు వచ్చింది.

Delhi: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది
Delhi Indira Gandhi International Airport
Follow us on

లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఢిల్లీలో బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం, ఢిల్లీలోని చాలా పెద్ద పాఠశాలలకు బాంబు బెదిరింపులతో కూడిన ఇమెయిల్‌లు వచ్చాయి. అదే సమయంలో, ఆదివారం (మే 12) ఢిల్లీలోని రెండు ఆసుపత్రుల తర్వాత, ఇప్పుడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)కి బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు.

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు, ఢిల్లీలోని రెండు వేర్వేరు ఆసుపత్రులకు బెదిరింపు ఇమెయిల్‌లు కూడా వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వాటిలో బాంబులతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. మొదటిది బురారీలోని ప్రభుత్వ ఆసుపత్రి, రెండవది మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి సైతం బెదిరింపు మెయిల్స్ రావడంతో ఢిల్లీ పోలీసులు పరుగులు పెట్టారు.

దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా, బాంబ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బందితో పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం పోలీసులకు అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదని తేల్చారు. విశేషమేమిటంటే విమానాశ్రయాలు, ఆసుపత్రులకు వచ్చిన బెదిరింపు ఇమెయిల్‌లు ఒకే మెయిల్ ఐడీ నుండి వచ్చాయి. ఈ మెయిల్స్ దాదాపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాయి. అయితే ఎయిర్‌పోర్టు, ఆసుపత్రుల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.

మే నెల ప్రారంభంలో, ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లోని సుమారు 150 పాఠశాలల్లో బాంబులు అమర్చినట్లు సమాచారం వచ్చింది. దీంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు తనిఖీలు నిర్వహించి, ఇది రూమర్ అని తేల్చారు. నేరస్థులు ఈ మెయిల్ పంపడానికి రష్యన్ సర్వర్‌లను ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమెయిల్ అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా అది ఫేక్ ఈమెయిల్ అని తేలింది.

అదే సమయంలో, ఫిబ్రవరి నెలలో, ఢిల్లీలోని ఆర్‌కెపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌కి కూడా ఇలాంటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అదే నెలలో, డబ్బు డిమాండ్ చేస్తూ సాకేత్‌లోని అమిటీ స్కూల్‌కు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..